చిన్న కొట్లాటే: విష్ణు-వంశీ ఘర్షణపై ఎంపి విహెచ్
హైదరాబాద్: కాంగ్రెస్ యువ నేతలు వంశీచంద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య జరిగింది చిన్న కొట్లాట మాత్రమేనని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపి హనుమంతరావు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్రేకంలో జరిగిన గొడవను ఇద్దరూ మర్చిపోయి పార్టీ కోసం పని చేయాలని సూచించారు.
ఇది ఇలా ఉండగా ఘటనపై ఇద్దరు యువనేతలు శనివారం తమ స్పందనను మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే గొడవ మొదలైందని అన్నారు.
వంశీచంద్ రెడ్డి తన దగ్గరికి వచ్చి చెవిలో దూషించారని విష్ణు చెప్పారు. వంశీచంద్ గన్‌మెన్ తన తలకు గన్ ఎక్కుపెట్టారని తెలిపారు. ఏం జరుగుతుందో అని భయపడి తాను చేయి చేసుకున్నానని విష్ణు చెప్పారు. వంశీచంద్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఈ విషయంలో హుందాగా వ్యవహరించాల్సిందని అన్నారు.

ఇది ఇలా ఉండగా తాను విష్ణువర్ధన్ రెడ్డిని దూషించలేదని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేశారని చెప్పారు. సిసి కెమెరా ఫుటేజీని చూస్తే ఎవరు దాడి చేశారో కనిపిస్తుందని అన్నారు. తాను ఎవరికీ జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అధిష్టానానికి ఈ ఘటనపై తాను ఫిర్యాదు చేయనని తెలిపారు.
శుక్రవారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి బావమరిది శశాంక్ రెడ్డి వివాహం శుక్రవారం మాదాపూర్‌లోని ‘ఎన్-కన్వెన్షన్'లో జరిగింది. వంశీచంద్ రెడ్డి కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. హాలులోకి వెళుతున్న సమయంలో వంశీచంద్ గన్‌మెన్ విష్ణువర్ధన్‌ను పక్కకు నెట్టివేయడంతో ఘర్షణకు దారితీసిందని కొంతమంది చెబుతున్నారు. తన గన్‌మెన్‌ను ఎందుకు కొట్టారని వంశీ ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగి, ఘర్షణకు దారి తీసిందని అంటున్నారు.
కానీ ఈ వాదనను వంశీ ఖండిస్తున్నారు. హాలులోకి వెళుతున్న సమయంలో విష్ణు తనకు షేక్‌హ్యాండ్ ఇచ్చారని, ఆ వెంటనే తనపై అకారణంగా దాడి చేయడం ప్రారంభించారని ఆయన తెలిపారు. తాను చెప్పింది వాస్తవమో కాదో సిసి టివీ ఫుటేజీ చూస్తే తెలుస్తుందన్నారు. తన గన్‌మెన్ దాడి జరగకుండా అడ్డు వచ్చారే తప్ప విష్ణును నెట్టి వేయలేదన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications