అద్దంకి దయాకర్, జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు.. సీఎం రేవంత్ ప్లాన్ అదుర్స్
తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్‌ఛార్జిలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఒక్కో జిల్లాకు ఒక్కో సీనియర్ కాంగ్రెస్ నేతను నియమించింది. ఈ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి విధివిధానాలను రూపొందించనున్నారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జిలను నియమించింది. పార్టీ సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా ఒక్కో జిల్లాకు సీనియర్ నేతను కేటాయించింది. జిల్లాల వారీగా ఇన్‌ఛార్జిల వివరాలు పరిశీలిస్తే.. జగ్గారెడ్డి-హైదరాబాద్, అద్దంకి దయాకర్-కరీంనగర్, పొన్నం ప్రభాకర్- మెదక్, అడ్లూరి లక్ష్మణ్- వరంగల్, సంపత్ కుమార్ - నల్గొండ, కుసుమ కుమార్ - మహబూబ్ నగర్ కు ఇన్‌ఛార్జిలుగా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది.
ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్చార్జిలను నియమించిన కాంగ్రెస్ పార్టీ
— Telugu Galaxy (@Telugu_Galaxy) July 7, 2025
వంశీ చంద్ రెడ్డి - ఖమ్మం
సంపత్ కుమార్ - నల్గొండ
అడ్లూరి లక్ష్మణ్ - వరంగల్
పొన్నం ప్రభాకర్ - మెదక్
జగ్గారెడ్డి - హైదరాబాద్
కుసుమకుమార్ - మహబూబ్ నగర్
అనిల్ యాదవ్ - ఆదిలాబాద్
అద్దంకి దయాకర్ - కరీంనగర్
అజ్మత్ హుసేన్ -… pic.twitter.com/235FUsGlHB
పొన్నం ప్రభాకర్ - మెదక్
అడ్లూరి లక్ష్మణ్ - వరంగల్
అద్దంకిదయాకర్ - కరీంనగర్
జగ్గారెడ్డి - హైదరాబాద్
వంశీ చంద్ రెడ్డి - ఖమ్మం
సంపత్ కుమార్ - నల్గొండ
కుసుమకుమార్ - మహబూబ్ నగర్
అనిల్ యాదవ్ - ఆదిలాబాద్
అజ్మత్ హుస్సేన్ - నిజామాబాద్
శివసేనా రెడ్డి - రంగారెడ్డి
మరోవైపు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల హడావిడి మొదలవుతోంది. బీసీ రిజర్వేషన్లు ఖరారు అయ్యాకనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో చెప్పినట్లు సమాచారం. ఇటీవల వేణుగోపాల్ తో జరిగిన భేటీలో స్థానిక ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లపై చర్చలు జరిగాయి. మరికొద్ది రోజుల్లో వీటిపై స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications