2019లో తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం: రేవంత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తెలంగాణతో పాటు కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.. సోమవారం సికింద్రాబాద్‌ మాజీ పార్లమెంటు సభ్యులు ఎం. అంజన్‌కుమార్‌ యాదవ్‌ను రేవంత్‌రెడ్డి కలిశారు.


రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్

  L Ramana Challenges Revanth Reddy : సంపాదించినది పేదలకు ఇచ్చేందుకు సిద్ధమా | Oneindia Telugu

  యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్, మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌గౌస్, కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో రేవంత్‌రెడ్డి చర్చించారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రానున్న రోజుల్లో అవలంభించాల్సిన వ్యూహంపై మాట్లాడుకొన్నారు.

   congress party will get power in Telangana next elections, says Revanth reddy

  తెలంగాణలో కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తూ కుటుంబ పాలన సాగిస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

  నగరంలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులతో కలిసి పార్టీ పటిష్టత కోసం తగిన ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీకి చెందిన సీనియర్లను, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిదులను రేవంత్‌రెడ్డి కలుస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Revanth Reddy met Secundrabad former MP Anjankumar Yadav on Monday.Revanth Reddy said that congress party will get power in Telangana state next assembly elections.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి