అయ్యయ్యో.. కేసీఆర్ కార్ పంక్చర్ చేసిన కాంగ్రెస్!!
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ను, కారును కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. ఎన్నికల్లో కేసీఆర్ ను తరిమికొట్టాలని, కారుకు పంచర్ చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది. ప్రతిరోజు వినూత్నంగా ప్రచార పర్వంలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ జోరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న కాంగ్రెస్ కేసీఆర్ హామీలను నేరవేర్చలేదని, మళ్ళీ హామీలు ఇస్తున్నారని, నమ్మి మోసపోవద్దని పేర్కొంది.
40 సెకన్ల నిడివి ఉండే ఒక షార్ట్ వీడియోలతో ప్రజలకు కేసీఆర్ పాలన అర్ధమయ్యేలా చెప్తుంది. ఇక డూప్ కెసిఆర్ ను రంగంలోకి దించిన కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలను టార్గెట్ చేసింది. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతుండగా ఆయన ప్రజలకు హామీలను గుప్పిస్తుండగా వాటికి పక్కనుండి కౌంటర్లు ఇవ్వడం పక్కాగా చేసింది.

ఇక మరో వీడియోలో ఎన్నికల ప్రచారానికి గ్రామాలకు వెళ్ళిన కేసీఆర్ ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో ప్రజలు నిరుద్యోగ భృతిపై, యువతకు ఉద్యోగాలపై, డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై ఇలా కెసిఆర్ ఇచ్చిన రకరకాల హామీలపై ఆయనను నిలదీస్తున్నట్టుగా వీడియోలను చిత్రీకరించి, ఆపై ప్రజలు వినకుండా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారని పేర్కొంది.
బీఆర్ఎస్ టార్గెట్గా కాంగ్రెస్ వినూత్న ప్రచారం..!#BRSParty #TelanganaCongress #ElectionCampaign #ElectionCampaign2023 #TelanganaElections2023 #TelanganaElection2023 #Telangana #Oneindiatelugu pic.twitter.com/rzRy6zJMU4
— oneindiatelugu (@oneindiatelugu) November 7, 2023
కారుకు పంచర్ అయింది అంటూ, పదేళ్ల అహంకారం పోవాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ పెద్ద ఎత్తున వీడియోల ద్వారా ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా తయారు చేయించిన ఈ వీడియోలతో కెసిఆర్ ఇచ్చే అబద్ధపు హామీలకు ప్రజలు నవ్వుతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.
ప్రజలు నమ్మడం లేదని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా తయారు చేయించిన ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి మన్ననలు పొందుతున్నాయి. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి నినాదంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలోకి వెళుతుంది.












Click it and Unblock the Notifications