కాంగ్రెస్ తొలి జాబితా: తెలంగాణ లోక్‌సభ అభ్యర్థులు వీరే: లిస్ట్‌లో పట్నం సునీత: స్టార్ హీరో భార్య
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఈ సంఖ్యను భారీగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని లోక్‌సభ పోలింగ్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. అటు ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి ఇదే పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని అధిగమించేలా లోక్‌సభ స్థానాలను గెలచుకోవడానికి కసరత్తు సాగిస్తోంది.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా వెలువడింది. మొత్తం 36 మందితో కూడిన జాబితా ఇది. ఇందులో రాహుల్ గాంధీ, శశిథరూర్, గీతా శివరాజ్ కుమార్, డీకే సురేష్.. వంటి సీినియర్ల పేర్లు ఉన్నాయి. రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వాయనాడ్ నుంచే లోక్‌సభకు పోటీ పడనున్నారు.
ఈ జాబితాలో తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. జహీరాబాద్- సురేష్ కుమార్ షెట్కార్, చెవెళ్ల- సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ- కుందూరు రఘువీర్, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వుడ్)- పొరిక బలరామ్ నాయక్ పేర్లు ఉన్నాయి.

ఊహించినట్టే- చేవెళ్ల లోక్‌సభ బరిలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డిని నిలిచారు. కొద్దిరోజుల కిందటే ఆమె భారత్ రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భర్త మహేందర్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్- 6, కర్ణాటక- 6, కేరళ- 15, మేఘాలయా-2, నాగాలాండ్-1, సిక్కిం- 1, త్రిపుర- 1 స్థానానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. కర్ణాటకలోని శివమొగ్గ లోక్‌సభ స్థానానికి శాండల్‌వుడ్ స్టార్ హీరో భార్య గీతా శివరాజ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ వంటి నేతలు ఉన్నారు.












Click it and Unblock the Notifications