కీచక ఖాకీ: మైనర్ కోడలుపై లైంగికదాడి..?, పోక్సో చట్టం కింద కేసు..
అతనో ఖాకీ, వరసకు మామ అవుతాడు. కానీ తన నీచపుబుద్దిని ప్రదర్శించాడు. ఓ చిన్నారికి మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక పేరంట్స్‌కు చెప్పడంతో వెలుగుచూసింది. వారు బాలల హక్కుల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. కానిస్టేబుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
రాంగోపాల్ పోలీసు స్టేషప్‌లో ఉమేశ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. నివాసం మాత్రం బోయిన్ పల్లి సిఖ విలేజీ స్కూల్ సమీపంలో ఉంటాడు. అయితే అతని భార్య గర్భవతి కావడంతో ఇటీవలే పుట్టింటికీ వెళ్లిపోయింది. తన ఇంటి దగ్గర ఉండే 12 ఏళ్ల బాలికపై కన్నుపడింది. ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అలా తరచు లైంగికదాడి చేస్తున్నాడు.

బాలిక కాస్త నలతగా ఉండటంతో ఏం జరిగింది అని పేరంట్స్ అడిగారు. అప్పుడు ఉమేశ్ చేసిన నిర్వాకం బయటపడింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న తల్లిదండ్రులు బాలల హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. వారు సంబంధిత పోలీసు స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారు. ప్రస్తుతం ఉమేశ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ నివేదికను కూడా ఫిర్యాదులో జతపర్చి.. చర్యలు తీసుకోనున్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications