‘Kolors’కు భారీ షాక్, ఏమైందంటే?
బరువు తగ్గిస్తాం, తెల్ల జుట్టును నల్లగా మారుస్తాం, బట్టతలపై కొత్తగా వెంట్రుకలను మొలిపిస్తామంటూ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున క్లినిక్‌లు వెలుస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని క్లినిక్‌లు మాత్రం భారీగా డబ్బులు వసూలు చేస్తూ వినియోగదారులకు ఆశించిన ఫలితాలను మాత్రం ఇవ్వడం లేదు. దీంతో వాటిపై కొందరు వినియోగదారులు కన్జూమర్ కమిషన్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
తాజాగా ఓ వినియోగదారు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సదరు క్లినిక్‌పై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా చికిత్స అందించే క్లినిక్‌లు నిబంధనల మేరకు నడుస్తున్నాయో లేదో నివేదిక అందించాలని హైదరాబాద్ డీఎంహెచ్‌వో, వైద్య విధాన పరిషత్ డైరెక్టర్‌ను రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. మార్చి 17వ తేదీలోపు నివేదిక అందించాలని పేర్కొంది.

వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన యువతి హైదరాబాద్ మియాపూర్‌లోని కలర్స్ (Kolor) హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బరువు తగ్గడానికి చికిత్స తీసుకుంది. రూ.1.05 లక్షలు చెల్లించిన యువతికి చికిత్స తీరు నచ్చకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కలర్స్ హెల్త్ కేర్ ప్రతినిధులను కోరింది. దీనికి ప్రతినిధులు నిరాకరించారు. దీంతో
సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది.
విచారణను చేపట్టిన జిల్లా వినియోగదారుల కమిషన్ యువతికి 9 శాతం వడ్డీతో డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అంతేగాక, మానసికంగా ఇబ్బంది కలిగించినందుకు రూ.50 వేలు జరిమానా విధించింది. డబ్బులు సకాలంలో చెల్లించకపోతే అదనంగా మరో 3 శాతం వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ క్రమంలో జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ కలర్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీలు దాఖలు చేశారు. చికిత్స తీసుకున్న యువతి తగిన సూచనలు పాటించలేదని, ఆహార నియమాలు పాటించకపోవడం వల్లే బరువు తగ్గలేదని కమిషన్‌కు అందించిన వివరాల్లో పేర్కొంది. దీనికి బాధిత యువతి సమాధానం ఇస్తూ అర్హత లేని వాళ్లతో కలర్స్ హెల్త్‌కేర్ వాళ్లు చికిత్స చేయిస్తున్నారని కమిషన్‌కు తెలిపింది.
ఇరువైపులా వాదనలు విన్న రాష్ట్ర వినియోగదారుల కమిషన్ కలర్స్ హెల్త్‌కేర్ సమర్పించిన అనుమతి పత్రాలు కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం చెల్లవని స్పష్టం చేసింది. నిపుణులైన వైద్యులు, సరైన అనుమతి పత్రాలు లేకుండా ఊబకాయం లాంటి కఠినమైన చికిత్సలను ఎలా అందిస్తున్నారని కలర్స్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కలర్స్ హెల్త్ కేర్ దాఖలు చేసిన అప్పీలును రాష్ట్ర వినియోగదారుల కమిషన్ కొట్టేసింది.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications