హైదరాబాదు వాసుల‌కు కూల్ న్యూస్‌.. ప‌లు జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు..!

గ‌తకొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. రోజురోజుకి భానుడు త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7కే ఎండ‌లు మండిపోతున్నాయి. ఆ స‌మ‌యంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావటానికి కూడా భ‌య‌ప‌డుతున్నారు. తీవ్రమైన వేడి, వడగాల్పులు, ఉక్క‌బోత‌తో జ‌నం అల్లాడిపోతున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ చెప్పింది. హైద‌రాబాద్‌లోని పలు జిల్లాల్లో మూడురోజుల‌పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది.

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఏప్రిల్ 19, 20, 21 తేదీలలో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుముఖం ప‌డుతాయ‌ని, ఆ మూడురోజులు ప‌లు జిల్లాల్లో వర్షపాతం న‌మోదు అవుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ 19వ తేదిన దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 20, 21వ తేదిల్లో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదు కానున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ వర్షాలతో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు, 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్స్ ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ భావిస్తోంది.

Cool news for the residents of Bhagyanagaram Rains for three days in many districts

ఇవాళ‌, రేపు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం..

నిన్న(ఏప్రిల్ 16న‌)బుధవారం నాడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప‌లు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మేడ్చల్, రాజేంద్రనగర్, నార్సింగి, కేపీహెచ్‌బీ, ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. నేడు భాగ్య‌నగరంలో ఆకాశం మేఘావృతమయ్యి, ఒక‌టి రెండు చోట్ల చిరుజ‌ల్లులు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు న‌గ‌రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావ‌ణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+