తెలంగాణకు చల్లని కబురు
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే పది రోజులపాటు అంటే ఏప్రిల్ 25 వరకు రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాలులు ఉండవని, సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయని పేర్కొంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే మండిపోయే ఎండలను చూసిన జనం.. నాలుగు రోజులుగా అక్కడక్కడ పడుతున్న చిరుజల్లులతో వాతావరణం చల్లబడటంతో సేదతీరుతున్నారు.
ఇదే వాతావరణం మరో పది రోజులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 25 వరకు వేడిగాలులు ఉండవని అంచనా వేసింది. ఏప్రిల్ 15 వరకు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజస్థాన్ పై నైరుతి రుతుపవనాలు తుఫాన్ గా మారి కోస్తా కర్ణాటక వరకు విస్తరించి ఉన్నాయని.. ఈ క్రమంలోనే రాబోయే ఐదురోజులపాటు హైదరాబాద్ లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
@CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #ECISVEEP #CEO_Telangana @TelanganaDGP @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/zIkURRk5CW
— IMD_Metcentrehyd (@metcentrehyd) April 13, 2024
కాగా, గురు, శుక్రవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా శనివారం మేఘావృతం కావడంతో ఎండ తీవ్రత తగ్గింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ఎండవేడిమి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.
7- day forecast(mid day) of Telangana Based on 0300 UTC issued at 1300 Hours IST dated: 13/04/2024@CEO_Telangana @TelanganaCMO @SpokespersonECI @ECISVEEP @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @CommissionrGHMC @HYDTP @IasTelangana @tg_weather #ECISVEEP pic.twitter.com/R2rGELNQ0e
— IMD_Metcentrehyd (@metcentrehyd) April 13, 2024












Click it and Unblock the Notifications