పెరుగుతున్న కేసులు: తెలంగాణలో రేపట్నుంచి కరోనా బూస్టర్ డోసు
హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 60వేలు దాటింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బూస్టర్ డోసు అందించాలని నిర్ణయించింది.
బుధవారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్బో వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా అందించనున్నట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. 5 లక్షల కార్బో వాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. మొదటి, రెండో డోసు కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఏది తీసుకున్నా.. బూస్టర్ డోసుగా కార్బి వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కార్బీ వాక్సిన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వమే దేశంలోని ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, రాష్ట్రాలే స్వయంగా కోవిడ్ వ్యాక్సిన్లు కొనుగోలు చేసి పంపిణీ చేయాలని సూచించింది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఈ నుంచి 5 లక్షల కార్బి వాక్సిన్ డోసులను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. రేపట్నుంచి పంపిణీ చేయనుంది. కాగా, తెలంగాణలో ప్రతి రోజు సుమారు 40పైకి కరోనా కేసులు నమోదవుతున్నాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications