తెలంగాణలో కరోనా: కొత్తగా 873 కేసులు -గ్రేటర్ పరిధిలోనే అధికం -రికవరీల్లో మరో రికార్డు

తెలంగాణలో కరోనా పరిస్థితులు కుదుటపడ్డట్లే కనిపిస్తున్నా.. సెకండ్ వేవ్ తలెత్తే అవకాశాలుండటంతో అధికారులు అప్రమత్తత పాటిస్తున్నారు. జిల్లాల్లో కొత్త కేసులు కాస్త తగ్గినా, రాజధాని హైదరాబాద్ లో మాత్రం వైరస్ ఉధృతి కనిపిస్తోంది. పైగా, సిటీలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండటం, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున జనం గుమ్మికూడుతుండటం ప్రమాద సంకేతాలనిస్తోంది..

Recommended Video

    #Telangana : తెలంగాణలో Corona సెకండ్ వేవ్ అవకాశాలు.. రాజధాని Hyderabad లో వైరస్ ఉధృతి!

    తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 873 కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,63,526కు, మరణాల సంఖ్య 1,430కు చేరింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంకాగా, తెలంగాణలో అది 0.54 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 182 కేసులు వచ్చాయి.

    covid-19 in ts: 873 new 4 deaths in last 24 hours, recoveries cross 2.50 lakh-mark

    రికవరీల పరంగా తెలంగాణలో మరో రికార్డు నమోదైంది. గత 24 గంటల్లో 1296 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2.5లక్షల మార్కును దాటి, 2,50,453కు చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.54 శాతంగా ఉండగా... దేశంలో అది 1.5 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 93.7 శాతం కాగా, తెలంగాణలో అది 94.03 శాతం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక..

    గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,646 శాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటిదాకా చేసిన కరోనా టెస్టుల సంఖ్య 51,34,335కు చేరిందని బులిటెన్ లో తెలిపారు. రికవరీలు పెరగడంతో రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 11,643గా ఉందని, వారిలో 9,345 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా పేషెంట్లలో చాలా మంది ఇండ్లలోనే చికిత్స పొందుతుండటంతో కొవిడ్ డెడికేటెడ్ ఆస్పత్రి గాంధీలో రద్దీ తగ్గింది. దీంతో శనివారం నుంచి గాంధీ ఆస్పత్రిలో నాన్ కొవిడ్ వైద్య సేవలను పునరుద్ధరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+