విలాసవంతమైన బిక్షగత్తె: కంగనా రనౌత్‌పై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు, హెచ్చరిక

హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత నారాయణ ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విలాసవంతమైన బిక్షగత్తే ఎవరైనా ఉన్నారంటే అది ఈ మధ్య పద్మశ్రీ అవార్డు తీసుకున్న నటి కంగనా రనౌత్‌ అంటూ ఘాటుగా విమర్శించారు. ఆమెకు స్వాతంత్య్ర పోరాటం గురించి పెద్దగా తెలియదు. ఆ బిరుదు ఇచ్చిన బీజేపీకి అస్సలు తెలియదంటూ నారాయణ మండిపడ్డారు.

1947లో వచ్చిన స్వాతంత్య్రం బిక్ష అని అసలు స్వాతంత్య్రం బీజేపీ వచ్చిన తరువాత 2014లో వచ్చిందని కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు నారాయణ. ఇంతకంటే బానిసత్వం ఏం ఉంటుందా? అని, నువ్వు అడుక్కోవాలి అనుకుంటే అడుక్కో ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. నీకు బిక్ష ఆర్ఎస్ఎస్ పెడితే.. దాన్ని స్వాతంత్య్ర పోరాటంతో పోలుస్తావా? స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడే అర్హ‌త నీకు, నీకు ప‌ద్మ‌శ్రీ ఇచ్చిన ఆ ప్ర‌భుత్వానికి కూడా లేదంటూ నారాయణ ధ్వజమెత్తారు.

 CPI leader Narayana slams Kangana Ranaut for her 2014 freedom remark

కంగనా కుష్టి రోగికంటే మించిన రోగిష్టి అంటూ విమర్శలు గుప్పించారు నారాయణ. ఆమె వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని, స‌మాజానికి ఆమె క్ష‌మాప‌ణ చెప్పాలని నారాయణ డిమాండ్‌ చేశారు. లేక‌పోతే పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం ఖాయమని హెచ్చరించారు. కాగా, కంగనా ఓ ఇంటర్వ్యూలో 1947లో స్వాతంత్య్రం రాలేదు అది బిక్షమాత్రమే. కాంగ్రెస్‌ హయాంలో బ్రిటీష్‌ పాలన కొనసాగిందని, 2014లో దేశానికి నిజమైన స్వాతంత్య్రం వ‌చ్చిందని వ్యాఖ్యానించింది. దీంతో వివాదం చెలరేగింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే బీజేపీ ఏంపీ వరుణ్‌ గాంధీ కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.

గురువారం బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలను ఖండించారు. ఆమె వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి.. ఇలాంటి ఆలోచనను పిచ్చితనంగా భావించాలా? లేక దేశ ద్రోహంగానా? అంటూ ధ్వజమెత్తారు. కొన్నిసార్లు మహాత్మాగాంధీ త్యాగాలు, దీక్షకు అవమానం.. మరికొన్నిసార్లు ఆయన హంతకుడికి గౌరవం. ఇప్పుడు మంగళ్ పాండే మొదలు రాణీ లక్ష్మీభాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఇలా లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల పట్ల తిరస్కార దోరణి. ఈ ఆలోచనను పిచ్చితనంగా పిలవాలా? లేదా దేశ ద్రోహంగానా? అని తీవ్రంగా స్పందించారు వరుణ్ గాంధీ.

Recommended Video

    KNRUHS : Spl Interview With Parents Of MBBS Students

    rk.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+