ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు.. బీఎన్ఎస్ యాక్ట్ క్రింద తెలంగాణలో తొలికేసు!!

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదయింది. తెలంగాణ రాష్ట్రంలో జూలై 1వ తేదీ నుంచి అమలవుతున్న నూతన క్రిమినల్ చట్టాల క్రింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్టులో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కావడం గమనార్హం.

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు వెనుక
అసలు పాడి కౌశిక్ రెడ్డి పై కేసు ఎందుకు నమోదయింది అంటే.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలకు సంబంధించి ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి హాజరైన ఎంఈఓ లను డీఈవో ట్రాన్స్ఫర్ చేశారు. నిన్న కరీంనగర్ జెడ్పి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డీఈవోని సస్పెండ్ చెయ్యాలని హంగామా సృష్టించారు.

Criminal case against MLA Padi Kaushik Reddy under new criminal laws First case in Telangana

జెడ్పీ సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే రచ్చ
కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశం జరగగా సర్వసభ్య సమావేశంలో డీఈవోను సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చెయ్యగా, గత ప్రభుత్వ హయాంలో మీరు చేసినప్పుడు అని తనను ప్రశ్నించిన చిగురుమామిడి జడ్పిటిసి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రవీందర్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ డీఈవో ని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు బి ఆర్ ఎస్ జడ్పిటిసి సభ్యులు అరగంట సేపు నిరసన తెలిపారు.

కలెక్టర్ విధులను అడ్డుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
సభ్యులు ఎంతకీ కంట్రోల్ కాకపోవడంతో కలెక్టర్ సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు .అయితే కలెక్టర్ వెళ్ళిపోతున్న సమయంలో ఆమెను అడ్డుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బంధు అంశంతో పాటు డీఈవో అంశంపై కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వెళ్లకుండా అడ్డుకోవడానికి మెట్లపై బైఠాయించారు. వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ ను పట్టుబట్టారు.

పోలీసులకు ఫిర్యాదు.. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం నమోదైన తొలికేసు
దీంతో కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన కారణంగా జడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 221, 126 (2) సెక్షన్ల క్రింద పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు. భారత న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం చట్టం అమలులోకి వచ్చిన రెండవ రోజు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన తొలి కేసు నమోదు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+