SRSP: పనికిరాకుండా పోయిన కాళేశ్వరం.. పైర్లకు ప్రాణం పోస్తున్న శ్రీరాంసాగర్..
గత సర్కార్ లక్షల కోట్లు వెచ్చించి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది. పంపు హౌస్ లు నీట మునిగి, బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయి కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా రాలేని పరిస్థితులో ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు శ్రీరాంసాగర్ ను నమ్ముకున్నారు. రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రీరాంసాగర్ నీళ్లు పొలాలకు చేరుతున్నాయి. కొద్ది రోజుల కోసం యాసంగి సీజన్ కో సం శ్రీరాంసాగర్ నుంచి విడుదల చేసి నీళ్లు సూర్యాపేట జిల్లా వరకు చేరుకున్నాయి.
మోతె, నడిగూడెం మండలాలకు నీరు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు కూడా ఇదే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. గతంలో ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనంగా చెప్పుకున్నారని మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాలకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నీళ్లు వస్తున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ 2 ఆయకట్టు కింద ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాల ఆయకట్టు ఉంది.

నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యాంలోకి నీటి విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎల్ఎండీ నుంచి ఈ నెల ఒకటిన విడుదలైన నీటితో కాకతీయ కెనాల్ ద్వారా వరంగల్ జిల్లాలోని మైలారం రిజర్వాయర్, ఆ తర్వాత బయన్నవాగు రిజర్వాయర్ నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి బయ్యన్నవాగు రిజర్వాయర్ ద్వారా వారబందీ పద్ధతిలో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్, నాగారం, అర్వపల్లి, సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు ఎస్, చివ్వెంల, పెన్ పహాడ్, కోదాడ నియోజకవర్గంలోని మోతే, నడిగూడెం, పెన్‌పహాడ్ మండలాలకు నీళ్లను విడుదల అవుతోంది.
గతంలో ఏ జిల్లాకు నీళ్లు వదిలినా, ఏ చెరువు మత్తడి పోసినా అవన్నీ కాళేశ్వరం జలాలే అంటూ బీఆర్ఎస్ పెద్దలు సంకలు గుద్దుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు తర్వాత ఇక వరంగల్, సూర్యాపేట జిల్లాలకు సాగునీటి సరఫరా ఉండకపోవచ్చని బీఆర్ఎస్ నేతలు అన్నట్లు గుర్తు చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications