వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cyber Crime: వైద్యుడి బలహీనత అదే.. అమ్మాయిని పంపుతామని చెప్పి రూ.కోటిన్నర కొట్టేశారు..

|
Google Oneindia TeluguNews

ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతతో వారిని ఆడుకుంటారు. చివరికి మోసం కూడా చేస్తారు. ఇలానే హైదరాబాద్ కు చెందిన ఓ వైద్యడి బలహీనతను అసరాగా చేసుకున్న సైబర్ నేరస్థులు లక్షలు కాజేశారు. వైద్యుడు డేటింగ్‌ వెబ్‌సైట్లో యువతుల కోసం వెతికాడు. ఇది తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు వైద్యుడి నుంచి ఏతందా రూ.కోటిన్నర వసూల్ చేశారు. గుజరాత్‌లో పనిచేస్తున్న హైదరాబాద్ కు చెందిన వైద్యుడు జిగోలో వెబ్‌సైట్‌, యాప్‌లలో డేటింగ్‌ చేసే యువతుల కోసం చూశాడు.

యువతిని పంపుతాం..

యువతిని పంపుతాం..


వెంటనే స్పందించిన సైబర్‌ నేరగాళ్లు యువతిని పంపుతామని డబ్బులు అడిగారు. దీంతో డాక్టర్ వారికి డబ్బు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేశాడు. సైబర్ నేరగాళ్ల వైద్యుడి వద్ద విడతల వారీగా రూ.40లక్షలు కొట్టేశారు. డబ్బు తీసుకుని అమ్మాయి పంపకపోయేసరికి మోసపోయానని గ్రహించిన డాక్టర్ 2020 అక్టోబరులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

కేసు దర్యాప్తులో ఉండగా..

కేసు దర్యాప్తులో ఉండగా..


అయితే కేసు దర్యాప్తులో ఉండగా... మరో రూ.30లక్షలు నిందితుల ఖాతాకు బదిలీ చేశాడు వైద్యుడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడికి డేటింగ్‌ వెబ్‌సైట్‌ల మోసాలపై కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కానీ అతని బలహీనతను ఆసరాగా చేసుకున్న నేరగాళ్లు డబ్బు పంపితే యువతిని పంపుతామని చెప్పారు. దీంతో అతను మళ్లీ నగదు పంపడం ప్రారంభించాడు. దశలవారీగా డేటింగ్‌ వెబ్‌సైట్‌ ఖాతాలకు రూ.80లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు. అతని కుటుంబ సభ్యులు వైద్యుడి ఖాతాను పరిశీలించగా నగదు బదిలీ చేసిన విషయం బయటకు వచ్చింది.

పోలీసుల అదుపులో నిందితుడు..

పోలీసుల అదుపులో నిందితుడు..


అతను గత మూడేళ్లలో వైద్యుడు పలు ఖాతాలకు రూ.కోటిన్నర సమర్పించుకున్నట్టు వారి పరిశీలనలో తేలింది. దీంతో మరోసారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ సైబర్‌ నేరస్థుడి ఖాతాలో భారీగా నగదు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి డేటింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

English summary
Cyber criminals cheated a doctor by taking One Crore and 50 lakhs. Police have registered a case and are investigating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X