Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇందిరమ్మ ఇల్లు వచ్చింది.. డబ్బులు కట్టాలని కాల్స్ వస్తున్నాయా?

సమాజంలో సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు అదును చూసి తమ ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా సైబర్ క్రిమినల్స్ దోపిడీకి తెగబడుతున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ ఇంటికి ఎంపికయ్యారు డబ్బులు కట్టాలి అంటూ ఫోన్ కాల్స్ చేస్తూ అమాయక ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్ళ పథకం పేరుతో సైబర్ నేరం
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు చేసుకున్న వారికి ఫోన్ కాల్స్ చేస్తూ.. మీరు ఇందిరమ్మ ఇల్లుకు అప్లికేషన్ చేసుకున్నారు కదా మీ పేరు ఎంపిక అయింది.. మీరు డబ్బులు కట్టాలి అని చెబుతూ లబ్ధిదారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ చేసి మీరు డబ్బులు కడితేనే మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని లేదంటే రాదని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు.

cyber criminals trying to do fraud with the name of indiramma houses

ఇందిరమ్మ ఇళ్ళకు డబ్బులు కట్టాలని ఫేక్ కాల్స్
ఒకపక్క ప్రభుత్వం ఎవరు ఎవరికి ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, మధ్య దళారులను నమ్మవద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అయితే ఇందిరమ్మ ఇంటికి ఎంపికైన వాళ్ళు డబ్బులు కట్టాలని ఫోన్ కాల్స్ వస్తుండడంతో అవి నిజమైన ఫోన్ కాల్స్ నా, ఫేక్ ఫోన్ కాల్స్ నా అర్ధం కాక లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఇక ఈ విషయాన్ని అధికారులు మరియు పోలీసుల దృష్టికి తీసుకు వెళుతున్నారు.

ఈ ఫోన్ కాల్స్ పై పోలీసులు చెప్తుందిదే
అయితే పోలీసులు ఇందిరమ్మ ఇంటికి డబ్బులు కట్టాలని ఎటువంటి ఫోన్ కాల్స్ ప్రభుత్వం నుంచి రావడంలేదని, ఎవరు పొరపాటున కూడా ఈ ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న పథకాల విషయంలో కూడా సైబర్ నేరగాళ్లు ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించడానికి రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలంటే ఇలా చెయ్యండి
ఎవరైనా ఇటువంటి కాల్స్ వస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఇటీవల కాలంలో వస్తున్న ఫోన్ కాల్స్ విషయంలో అందరూ తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా నగదు లావాదేవీలు అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ తో చెయ్యొద్దు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+