దానం నాగేందర్ రాజీనామా- ఢిల్లీ మంత్రాంగం, కీలక పదవిపై హామీ..!?

తెలంగాణలో మరో ఉప ఎన్నిక తప్పేలా లేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అనర్హత పిటీషన్ పై విచారణ కోసం స్పీకర్ తాజాగా మరోసారి దానం కు నోటీసు జారీ చేసారు. ఇదే సమయంలో ఢిల్లీలో పార్టీ ముఖ్య నాయకత్వంతో దానం చర్చలు చేస్తున్నారు. రాజీనామాకు సిద్ధమేనంటూ కొన్ని అంశాల ను ప్రస్తావించారు. ఉప ఎన్నిక తరువాత కీలక పదవి పైనా దానంకు హామీ లభించినట్లు సమాచారం. కాగా.. కడియం శ్రీహరి విషయంలోనూ ఇదే మార్గం అనుసరించే అవకాశం ఉంది.

తెలంగాణ లో ఎమ్మెల్యేల అనర్హత.. రాజీనామాల అంశం కొత్త టర్న్ తీసుకుంది. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ విచారణ చేస్తున్నారు. ఇప్పటికే నాటికి దానం నాగేందర్‌, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణను పూర్తి చేశారు. అనర్హత పిటిషన్లపై ఈ నెల 23కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలకు స్పీకర్‌ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసులు అందుకున్న రోజే దానం కాంగ్రెస్‌ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు పిటిషన్లపై విచారణ దాకా వెళ్లకుండా, రాజీనామా చేయడమే మేలన్న భావనలో ఉన్న ఆయన.. అధిష్ఠానం అనుమతి కోసమే ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.

Danam Nagender may resign amid disqualification notices here the details

కాగా, నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించ డంతో పిటిషన్లపై ఈ నెల 23కల్లా వివరణ ఇవ్వాలంటూ దానం, కడియంకు స్పీకర్‌ మళ్లీ నోటీసు లు జారీ చేశారు. అయితే బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన దానం.. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారినట్లుగా స్పష్టమైన ఆధారం ఉన్నట్లయింది. తనపై విచారణ కొనసాగితే అనర్హత వేటు పడే అవకాశం ఉందని, అంతవరకూ వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేయాలని దానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలతో ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ సీటును తనకు కేటాయించడం లేదా ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో స్థానం కల్పించా లని కోరుతున్నట్లు సమాచారం.

Danam Nagender may resign amid disqualification notices here the details

అయితే, తాను రాజీనామాకు సిద్దంగా ఉన్నానని..ఇక.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వాలని, గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రతిపాదన చేసినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీని పైన స్పష్టమైన హామీ రాగానే దానం రాజీనామా ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అధిష్ఠానం సమయం తీసుకుంటే.. దానం స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కోరే అవకాశం ఉంది. మర వైపు కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్‌ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన కడియం శ్రీహరి.. లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన తన కూతరు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సమయంలోనే అనర్హత పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కడియం శ్రీహరి స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కోరారు. కడియం తో రాజీనామా కంటే.. కొంత కాలం వేచి చూడటం మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. దానం రాజీనామా చేస్తే.. గ్రేటర్ పరిధిలో మరో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+