ఈ ఇంజెక్షన్ వాడితే.. "అనారోగ్య ప్రాప్తిరస్తు" అనాల్సిందే !

హైదరాబాద్‌లో యువత ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రమాదకర డ్రగ్స్‌ను అక్రమంగా విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కండరాల వృద్ధి పేరిట యువతను ఆకర్షిస్తూ "మెఫెంటెర్మైన్ సల్ఫేట్" అనే షెడ్యూల్ హెచ్ ఇంజక్షన్లను లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్న అబ్దుల్ గఫార్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇంజక్షన్ల వినియోగం వల్ల గుండెపోటు, అధిక రక్తపోటు వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

టాస్క్ ఫోర్స్-ఫలక్‌నుమా పోలీసుల సంయుక్త ఆపరేషన్..

ఈ అక్రమ దందాపై అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సౌత్ జోన్), ఫలక్‌నుమా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి సుమారు రూ. 24,000 విలువైన మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ గఫార్ ఖాన్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ అక్రమ వ్యాపారానికి దిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

dangerous-drugs-selling-in-hyderabad-for-youth-issue-came-into-light-and-police-arrested-few-linked

అయితే బర్కాస్ ప్రాంతానికి చెందిన అహ్మద్ నాది అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు ఈ ఇంజక్షన్లను కొనుగోలు చేసి, జహనుమా, ఫలక్‌నుమా పరిసరాల్లో యువతకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా జిమ్‌లకు వెళ్లే, కండరాలు త్వరగా పెంచుకోవాలనుకునే యువతను అబ్దుల్ గఫార్ ఖాన్ లక్ష్యంగా చేసుకున్నాడు. వైద్యుల పర్యవేక్షణ లేకుండానే ఇంజక్షన్లు వాడితే త్వరగా ఫలితం వస్తుందంటూ యువతను మభ్యపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా యువత ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 47/2026, సెక్షన్స్ 318(4), 278, r/w 3(5) BNS కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అహ్మద్ నాది ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఎంత ప్రమాదకరం?

మెఫెంటెర్మైన్ సల్ఫేట్ అనేది షెడ్యూల్ హెచ్ డ్రగ్. ఇది కేవలం గుర్తింపు పొందిన వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే విక్రయించాలి. డాక్టర్ సలహా లేకుండా వాడితే

గుండెపోటు (Cardiac Arrest)

అధిక రక్తపోటు (High BP)

గుండె స్పందన అసమతుల్యం

నరాలపై తీవ్ర ప్రభావం

వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యువతకు పోలీసుల హెచ్చరిక..

యువత ఎలాంటి షార్ట్‌కట్ మార్గాలను ఆశ్రయించకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇంజక్షన్లు లేదా మందులు వాడవద్దని పోలీసులు స్పష్టంగా సూచించారు. అక్రమ డ్రగ్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి దందాల్లో పాల్గొన్న వారిపై కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అలానే నగరవ్యాప్తంగా జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్ల సమీపాల్లో అక్రమ డ్రగ్ విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువత ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఇలాంటి దందాలను పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+