కక్ష గట్టి రాజాసాబ్ సినిమాను ఇలా... తెర వెనుక..!!
రాజాసాబ్ సినిమా పై కక్ష కట్టారా. రాజకీయంగా ఏం జరిగింది. తెలంగాణలో సినిమా టికెట్ల విషయ కోర్టుకు వెళ్లింది. మంత్రి కోమటిరెడ్డి సైతం సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో తన జోక్యం లేదని చెప్పటం సంచలనంగా మారింది. ఇప్పుడు రాజాసాబ్ సినిమా పైన ప్రబుత్వం కక్ష కట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. హీరో ప్రభాస్ పెద్దమ్మ తెలంగాణలో బీఆర్ఎస్ గురించి చెప్పిన అంశాలు ఇప్పుడు ఈ సినిమా విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కారణమంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమా గురించి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని సినీహీరో ప్రభాస్ పెద్దమ్మ అభిప్రాయం వ్యక్తం చేస్తే.. ఆ విషయం గుర్తుంచుకొని రేవంత్‌రెడ్డి సర్కార్ కక్షగట్టి.. రాజాసాబ్ సినిమా రేట్లపెంపునకు అనుమతి ఇవ్వలేదని దాసోజు శ్రవణ్‌ఆరోపించారు. కక్ష పూరిత చర్యల్లో భాగంగానే రాజాసాబ్ సినిమాకు జీవో ఇచ్చినట్లే ఇచ్చి హైకోర్టు స్టే వచ్చేటట్లు చేశారని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ఒక్కో హీరోకు ఒక్కో న్యాయమా.? ఒక సినిమాను తిరస్కరించి.. మరో సినిమాకు అనుమతించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ప్రమేయం లేకుండా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని హరీశ్ మాట్లాడింది నిజంకాదా..అంటూ నిలదీసారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు మాటల దాడులు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.
సీఎం సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్న తీరుచూసి ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమపై జులుం, విచ్చలవిడిగా అవినీతి పెరిగిందని ఆరోపించారు. ప్రతి విషయంలో కమిషన్లు దండు కోవడం పరిపాటైందని పేర్కొన్నారు. 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం ప్రదర్శనలు కలెక్టర్ పరిధిలోనే ఉంటుందని చెపారు నచ్చిన వారికి నజరానా - నచ్చని వారికి జరిమానా అన్నట్లు ప్రభుత్వ వైఖరి ఉందన్నారు.
ఒక్కో సినిమాకు ఒక్కో శాఖ నుంచి జీవోలు రావడం న్యాయమేనా అని ప్రశ్నించారు. సీఎంఓ ఒత్తిళ్లతోనే జీవోలు విడుదల అవుతున్నాయని మండిపడ్డారు. మొదట కమిషన్లు రాలేదని మాట్లాడుతూ... తర్వాత వాటా రాగానే కోమటి రెడ్డి మాట మార్చడం స్పష్టమైన అవినీతి అని విమర్శించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో "టికెట్ ధరలు పెంచనివ్వను" అని మాట ఇచ్చారని.. ఇప్పుడు ఏ కమిషన్ల కోసం మాట మార్చారని ప్రశ్నించారు. థియేటర్లలో దోపిడీ జరుగుతుంటే సీఎం, మంత్రి ఏమి చేస్తున్నారని నిలదీసారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications