పట్టపగలే దొంగల బీభత్సం: యజమానిని కత్తితో పొడిచి నగల షాపులో దోపిడీ

మేడ్చల్ మల్కాజిగిరి: మేడ్చల్ జిల్లా కేంద్రంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. అది కూడా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న నగల దుకాణంలోనే దోపిడీకి పాల్పడ్డారు. పట్టపగలే జువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దొంగలు షాప్ యజమానిని కత్తితో పొడిచి గల్లాపెట్టెలోని డబ్బులతో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీకి సంబంధించిన దృశ్యాలో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషారం అనే వ్యక్తి జగదాంబ జువెల్లరి షాప్ నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజూ లాగే గురువారం ఉదయం దుకాణం తెరిచాడు. సరిగ్గా మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో షాపులో కస్టమర్లు లేనప్పుడు చూసి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. అందులో ఒక దుండగుడు బుర్ఖా ధరించి రాగా, మరో వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు.

Daylight robbery Jewelery shop robbery after owner stabbed

దుండగులిద్దరూ షాపులో చొరబడి యజమాని శాషారాంను కత్తితో పొడిచి నగదుతో పరారయ్యాడు. ఘటన అంతా అక్కడున్న సీసీకెమెరాల్లో రికార్డయింది. దాడి జరిగిన సమయంలో శేషారాం కుమారుడు ఆయన వెంటే ఉన్నాడు. పారిపోతున్న దొంగలపై స్టూల్ విసిరేశాడు. స్టూల్ తాకినా పట్టించుకోకుండా దొంగలు అక్కడ్నుంచి ఉడాయించారు. శేషారాం గాయడపటంతో వెంటనే అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రులో చికిత్స పొందుతున్నాడు.

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా షాపులో ఉన్న సీసీకెమెరాలు పరిశీలించగా ఫుటేజీలో దోపిడీ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి.వీడియో ఫుటేజీ ఆధారంగా దొంగల ఆచూకీ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. అయితే ఈ ఘటనలో షాపులో ఎంత నగదు వారు ఎత్తుకెళ్లారో ఇంకా తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+