కొండాయి జంపన్నవాగులో గల్లంతైన నలుగురి మృతదేహాలు లభ్యం; తాజా పరిస్థితి ఇలా!!

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న వర్ష బీభత్సం అనేకమంది ప్రాణాలను తీస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లి గ్రామాలను ముంచెత్తడంతో ఊహించని విధంగా అనేకమంది మృత్యు వాత పడ్డారు. నిన్నటికి నిన్న ఏటూరునాగారం మండలం కొండాయిలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో జంపన్న వాగులో ఎనిమిది మంది గల్లంతు కాగా, నలుగురిని స్థానికులు కాపాడారు.

మిగతా నలుగురు జంపన్న వాగులో కొట్టుకుపోయారు. మరో ఇద్దరు, ముగ్గురి ఆచూకీ లభించ లేదు. వీరి కోసం గాలింపు చేపట్టిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు జంపన్న వాగులో గల్లంతైన నలుగురు మృతదేహాలను వెలికితీశారు. జంపన్న వాగులో కొట్టుకుపోయిన కొండాయి వాసులలో మజీద్, షరీఫ్, అజ్జు , డబ్బకట్ల సమ్మక్కలు మృతి చెందినట్టుగా తెలుస్తుంది.

Dead Bodies of four missing persons found in Kondai Jampanna vagu; This is the latest situation!!

ఇదిలా ఉంటే ములుగు ఏజెన్సీ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుందని, వారిని కాపాడాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆరుగురు గల్లంతయ్యారని ములుగు ఎమ్మెల్యే సీతక్క నిన్న కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్క హెలికాప్టర్ ఉంటే ఏ ఒక్కరి ప్రాణాలు పోకుండా కాపాడటానికి అవకాశం ఉండేదని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికి కూడా కొండాయి పరిసర ప్రాంతాలలో గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయని, దాదాపు 100 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని హెలికాప్టర్ పంపి వారిని కాపాడాలని వేడుకుంటున్నారు. రెస్క్యూ టీములు వెళ్లలేనంత తీవ్రమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయని, వెంటనే రక్షణ చర్యలను చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కొండాయి, మల్యాల, మేడారం గ్రామాలను జంపన్న వాగు ముంచేస్తోంది. కొండాయి పరిసర గ్రామాలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటున్నాయి. గోదావరి ఉధృతి పెరగడం, జంపన్న వాగుకు వరద పోటెత్తడంతో వీరు భయాందోళన మధ్య ఉన్నారు. వీరిని తక్షణం కాపాడి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మేడారం గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

మరోవైపు గోదావరికి వరద ఉధృతి పెరగటం కూడా ఏజెన్సీ వాసులను ఆందోళనకు గురి చేస్తుంది. గోదావరికి ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇంకా గోదావరికి వరద ఉధృతి పెరిగితే మరికొన్ని ఏజెన్సీ గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+