వీడియో: హేటర్స్ ఎంతకు తెగించారు?- తీవ్ర ఉద్రిక్తత

Devara: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ నటించిన మచ్ అవైటెడ్ మూవీ.. దేవర పార్ట్- 1. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్స్‌లోనూ భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది.

యువ సుధ ఆర్ట్స్, హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో నెగెటివ్ రోల్‌లో నటించారు. షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్.. ఇతర కీలక పాత్రలను పోషించారు.

Devara release NTR cutout at Sudarshan 35 mm theatre in Hyderabad was burnt

2018లో అరవింద సమేత వీర రాఘవ తరువాత ఎన్టీఆర్ నటించిన సోలో హీరోగా నటించిన బిగ్ బడ్జెట్ మూవీ కావడం వల్ల ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. వాటన్నింటినీ అందుకుందిది. ఈ మూవీలో జూనియర్ డ్యూయెల్ రోల్‌లో కనిపించడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

దేవర విడుదలైన అన్ని థియేటర్ల వద్ద ఆయన అభిమానులు అర్ధరాత్రి నుంచే సందడి చేశారు. కటౌట్లు పెట్టారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు. బాణాసంచాను కాల్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ నినాదాలు చేశారు.

ఈ అభిమానం కాస్త ముదిరింది. దేవర సినిమాను ప్రదర్శిస్తోన్న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గల సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద ఫ్యాన్స్ భారీగా బాణాసంచా కాల్చారు. వాటి నిప్పు రవ్వలు పడి- అక్కడ ఏర్పాటు చేసిన సుమారు 40 అడుగుల ఎన్టీఆర్ కటౌట్ మంటలకు కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్‌ అయ్యాయి.

ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై. దేవర సూపర్ హిట్ టాక్ రావడం నచ్చని వాళ్లు దాన్ని ఉద్దేశపూరకంగా తగులబెట్టి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు అభిమానులు. బాణాసంచా పడటం వల్లే మంటలు అంటుకున్నాయనీ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+