రేషన్ కార్డ్స్ రచ్చ.. మంత్రి పొన్నం Vs ఎమ్మెల్సీ దాసోజు డైలాగ్ వార్ !
హైదరాబాద్ నగరంలోని బంజారా భవన్‌లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆయనను అడ్డుకోవడంతో వేదికపై రసాభాసా నెలకొంది.
మంత్రి పొన్నం మాట్లాడుతూ.. "గత కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. తాము అధికారంలోకి వచ్చిన తర్వతనే గృహ అవసరాలను గుర్తించి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాం" అంటూ విమర్శలు గుప్పించారు.

ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "కేసీఆర్ హయాంలోనే 6 లక్షల రేషన్ కార్డులు జారీయ్యాయి. ఈ మాటలు వాస్తవానికి విరుద్ధం," అంటూ దాసోజు శ్రవణ్ బదులిచ్చారు. ఆయనతో పాటు అక్కడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా వేదికపైకి వెళ్లి సమస్యలు వివరిస్తామంటూ ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లు సైతం వేదిక పైకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో గందరగోళం చోటు చేసుకోగా.. మంత్రి పొన్నం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇద్దరూ బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం.. ఇక్కడ మీ తమాషాలకు చోటు లేదు" అంటూ దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు. అంతే కాకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రవర్తన పట్ల కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications