వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ‌రీష్ తో విభేదాలు అన‌ర్థమే..! బావా బావ‌మ‌రుదుల చెట్టప‌ట్టాల్..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర స‌మితిలో బావాబావ‌మ‌రుదుల స‌వాల్ అంశం తారా స్థాయిలో న‌డుస్తోంది. హ‌రీష్ రావు ప్రాధాన్య‌త త‌గ్గించి పూర్తి స్థాయిలో కేటీఆర్ ను రంగంలోకి దించుదామ‌నుకుంటున్న పార్టీ అధినేత చంద్ర‌శేఖ‌ర్ రావు వ్యూహాలు పూర్తి స్థాయిలో ఫ‌లించే అవ‌కాశాలు క‌నిపించ‌డ‌డం లేదు. తెలంగాణ ప్ర‌జ‌లు హ‌రీష్ రావును ఆధ‌రిస్తున్న స్థాయిలో కేటీఆర్ ను ఆద‌రించ‌క పోవ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో మ‌రి కొద్ది రోజులు హ‌రీష్ రావుతో స‌ఖ్య‌త కొన‌సాగించాల‌ని అదిష్టానం భావిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే కేటీఆర్, హ‌రీష్ రావులు ఒకే వేదిక మీద త‌ళుక్కుమంటూ పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకుంటున్నారు. దీంతో పార్టీ హైక‌మాండ్ తో హ‌రీష్ రావు కు, ముఖ్యంగా కేటీఆర్ తో ఎలాంటి విభ‌దాలు లేవనే సంకేతాల‌ను ఇస్తున్నారు టీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు.

కేటీఆర్-హ‌రీష్ అంశంపై వేడి వేడి చర్చ..! విభేదాలు లేవంటున్న నేత‌లు..!!

కేటీఆర్-హ‌రీష్ అంశంపై వేడి వేడి చర్చ..! విభేదాలు లేవంటున్న నేత‌లు..!!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాల్లో కేటీఆర్-హ‌రీష్ రావు అంశంపై ప్రస్తుతం వేడి వేడి చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం హరీష్ రావు తన నియోజకవర్గానికి చెందిన పనుల కోసం సీఎం కెసీఆర్ తో సమావేశం అయ్యారు. ఆయన ఈ అంశంపై కెటీఆర్ తో మాట్లాడుకోమని హరీష్ కు సూచించారని తెలిపాయి ఆ పార్టీ వర్గాలు . అప్పటివరకూ ఏ పని అయినా కెసీఆర్ తో ఓకే చేయించుకోవటమే హరీష్ కు అలవాటు. అనూహ్యంగా తాను అడిగిన పనిపై కెటీఆర్ తో మాట్లాడుకోమని కెసీఆర్ సూచించటంతో హరీష్ కాస్త ఇబ్బందిగా భావించి అక్క‌డ నుండి వెళ్ళిపోయిన‌ట్టు స‌మాచారం.

సొంత మీడియాలో హరీష్ కు త‌గ్గిన ప్రాధాన్య‌త‌..!అబ్బే..అలాంటిదేం లేదంటున్న గులాబీ ద‌ళం..!!

సొంత మీడియాలో హరీష్ కు త‌గ్గిన ప్రాధాన్య‌త‌..!అబ్బే..అలాంటిదేం లేదంటున్న గులాబీ ద‌ళం..!!

ఆ సంఘ‌ట‌న నుంచే కెసీఆర్, హరీష్ మధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు బాగా పెరిగిన‌ట్టు వార్త‌లు గ‌ప్పుమ‌న్నాయి. తర్వాత పలు అంశాల్లో హరీష్ ను దూరం పెట్టారు. టీఆర్ఎస్ సొంత మీడియాలో హరీష్ కు అసలు ఏ మాత్రం ప్రాముఖ్యత లేకుండా చేశారు. కానీ ఈ మధ్యే గజ్వేల్ కు చెందిన కొంత మంది నేతలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ లో చేరారు. ఇది టీఆర్ఎస్ వర్గాలను షాక్ కు గురి చేసింది.ఇంత జ‌రుగుతున్న హ‌రీష్ రావు పార్టీ మారుతున్న నాయ‌కులను గాని, కార్య‌క‌ర్త‌ల‌ను గాని బుజ్జ‌గించే ప‌ని చేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపించాయి.

హ‌రీష్ కు ప్ర‌త్యేక కోట‌రీ..! ప‌క్క‌న పెడితే ఇబ్బందే..!!

హ‌రీష్ కు ప్ర‌త్యేక కోట‌రీ..! ప‌క్క‌న పెడితే ఇబ్బందే..!!

హరీష్ తో సంబంధం లేకుండా పార్టీని వీడిన వారిని వెనక్కి తెఛ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో హరీష్ ను రంగంలోకి దింపారు. హరీష్ రంగంలోకి దిగిన వెంటనే కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళు వెంటనే తిరిగి టీఆర్ఎస్ లోకి రప్పించారు. హరీష్ ను దూరం పెడితే జరిగే నష్టం గ్రహించే కెటీఆర్ స్వయంగా హరీష్ తో మాట్లాడినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చాలా సమావేశాలకు దూరం పెడుతున్న హరీష్ రావును ఇటీవల అనూహ్యంగా సిరిసిల్ల నియోజకవర్గ సమావేశానికి హరీష్ రావును ఆహ్వానించారు. ఇది ప‌క్కా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

కేటీఆర్ క‌న్నా హ‌రీష్ కే ఫాలోయింగ్ ఎక్కువ‌..! ప్రాధాన్య‌త ఇవ్వాల్సిందే..!!

కేటీఆర్ క‌న్నా హ‌రీష్ కే ఫాలోయింగ్ ఎక్కువ‌..! ప్రాధాన్య‌త ఇవ్వాల్సిందే..!!

ఆ సమావేశంలోనే హరీష్ పై కెటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. హరీష్ కూడా కెటీఆర్ ను పొడిగిన విషయం తెలిసిందే. కేవలం తమ అవసరాలకే ప్రస్తుతానికి హరీష్ రావును దగ్గరకు తీసుకున్నారని, లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే టెన్షన్ లో కెసీఆర్, కెటీఆర్ ఉన్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ లో ప్రస్తుతానికి ఈ ఆదిపత్య పోరు సద్దుమణిగినట్లు ఉన్నా, తర్వాత ఎన్ని మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠ పార్టీలో శ్రేణుల్లో నెల‌కొంది. హ‌రీష్ రావుకు పార్టీ క్యాడ‌ర్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉండ‌డంతో త‌న ప్రాధాన్య‌త‌ను పార్టీలో ఉన్న‌ప‌ళంగా త‌గ్గిస్తే ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన అదిష్టానం హ‌రీష్ తో స‌ఖ్య‌త రాగాలు పాడుతున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
The differences between ktr and hareesh rao becoming hard in trs party. but the huge fallowing of hareesh rao in telangana protecting him. kcr feeling that by decreasing hareesh significance in the party its threat to trs. so a few days its necessary to continue hareesh mania in the party. thats why hareesh and ktr together participating in the common public meetings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X