మీకు ఇంటర్నెట్ సమస్య ఉండదు.. ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు
తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సేవలను వేగవంతం చేయడానికి, రాష్ట్రంలో ప్రజలందరికీ తక్కువ ధరలకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. టీ ఫైబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి రెడీ అవుతుంది
మారుమూల కుగ్రామాలకు ఇంటర్నెట్ సేవలు
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని 26 జిల్లాలలో 9వేల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ రింగ్ కనెక్టివిటీ ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లాను, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలను ఈ పరిధిలోకి చేర్చారు. ఈ కనెక్టివిటీ కారణంగా ఇంటర్నెట్ సేవలలో ఎటువంటి అంతరాయాలు లేకుండా ఉంటాయి. దేశవ్యాప్తంగా డిజిటల్ విప్లవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మారుమూల కుగ్రామాలకు కూడా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది.

తెలంగాణాలో డిజిటల్ సేవలు అందించటానికి కేంద్రం సహకారం
ఇందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణలో కూడా డిజిటల్ సేవలను అందించడానికి కేంద్రం రాష్ట్రానికి తన వంతుగా సహకారం అందిస్తుంది. ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కృషి ఫలితంగా ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రింగు కనెక్టివిటీ కి కేంద్రం 432కోట్ల రూపాయలను మంజూరు చేసింది అంతేకాదు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ నిర్వహణకు 2697కోట్లతో కలిపి మొత్తం 3185కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది.
తెలంగాణాలో ఆ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్
మరోవైపు టీ ఫైబర్ నాలుగు గ్రామాలలో ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ల పైలెట్ ప్రాజెక్టును సక్సెస్ చేసింది. తెలంగాణలో ఈ మోడల్ సక్సెస్ కావడంతో ఇది గుర్తించిన కేంద్రం రింగ్ కనెక్టివిటీ లేని ఇతర జిల్లాలకు ఈ విధానాన్ని వర్తింపచేయడానికి ఆమోదం తెలిపింది. భారత్ నెట్ ఏబిపి అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానవాటా ఉండే ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేసి రాష్ట్రవ్యాప్తంగా అనేక కుగ్రామాలలో నెట్ సదుపాయం కల్పించడానికి కృషి చేస్తోంది.
ఏబీపీని 12769 గ్రామాలలో అమలుకు ఆమోదం తెలిపిన కేంద్రం
కేంద్ర క్యాబినెట్ ఏబీపీని మొత్తం 12769 గ్రామాలలో అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఇందులో 1946 గ్రామాలలో అప్గ్రేడేషన్ తో పాటు, 36 గ్రామాలలో కొత్త కనెక్టివిటీ అవసరమని పేర్కొంది. ప్రస్తుతం 10,787 గ్రామాలలో రింగ్ కనెక్టివిటీ ఉంది. అయితే ఏబీపీ కింద 2,93,266 కనెక్షన్లకు సెటప్ బాక్స్, ఇతర ఖర్చుల కోసం కేంద్రం సబ్సిడీని అందిస్తుంది. ప్రతి ఇంటికి కనీసం 25 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగంతో ఇంటర్నెట్, 691 బ్లాకులకు బీఎస్‌ఎన్‌ఎల్ లీజ్డ్ లైన్స్ కనెక్టివిటీని అందించేందుకు కృషి చేస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications