పంచనామా చేశారు- 3న రమ్మన్నారు

Dil Raju: తన ఇళ్లు, కార్యాలయాలపై జరిగిన ఆదాయపు పన్ను అధికారుల దాడులపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు. హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దాడుల గురించి వివరించారు.

దిల్ రాజు నివాసాలు, కార్యాలయాలపై నాలుగు రోజుల పాటు ఐటీ దాడులు కొనసాగిన విషయం తెలిసిందే. ఆయన నిర్మించిన రెండు భారీ బడ్జెట్ సినిమాలు- గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మూడు రోజుల వ్యవధిలో విడుదల కావడం, అదే స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకున్నాయంటూ ప్రకటనలు ఇవ్వడం ఈ దాడులకు కారణం అయ్యాయనే వాదన ఉంది.

Dil Raju explained about IT raids in his residence and offices in Hyderabad

వీటిపై దిల్ రాజు తాజాగా విలేకరులతో మాట్లాడారు. ఐటీ దాడులు జరిగిన సమయంలో ఇంట్లో 20 లక్షల రూపాయల లోపు మాత్రమే నగదు మొత్తం ఉందని అన్నారు. ఈ మొత్తంలో తన వద్ద ఉన్నది అయిదు లక్షల రూపాయలేనని వివరించారు. శిరీష్ వద్ద రూ.4.5 లక్షలు, కూతురి వద్ద రూ.6 లక్షలు, ఆఫీస్‌లో 2.5 లక్షల రూపాయలు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలిపారు.

ఐటీ దాడుల సందర్భంగా ఐటీ అధికారులు ఇంట్లో స్థిర- చరాస్తులపై పంచనామా నిర్వహించారని వెల్లడించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను తన చేతికి అందజేశారని అన్నారు. వాటిని ఈ విలేకరుల సమావేశంలో చూపించారు.

ఈ అయిదు సంవత్సరాల కాలంలో తాము ఎలాంటి ఆస్తులను కొనుగోలు చేయలేదని వివరించారు. డాక్యుమెంట్ల పరిశీలన సందర్భంగా ఐటీ అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారని దిల్ రాజు పేర్కొన్నారు. సంబంధిత శాఖ వద్దకు వెళ్లి తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారని దిల్ రాజు చెప్పారు.

హైదరాబాద్‌లో కొన్ని ప్రైవేట్ సంస్థలు, ఇతర ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపైనా ఐటీ దాడులు జరుగుతున్నప్పటికీ మీడియా ఫోకస్ మొత్తం తన మీదే ఉందని దిల్ రాజు గుర్తు చేశారు. సెలెబ్రిటీని కావడం వల్ల తనపై జరిగిన ఐటీ సోదాలు, తనిఖీలకు మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో- వాస్తవ పరిస్థితులు ఏమిటనేది తెలియజేయడానికే ప్రెస్ మీట్ పెట్టాననీ అన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన తమను కలవాలంటూ ఐటీ అధికారులు ఆదేశించారని, తన ఆడిటర్లు వెళ్లి వాళ్లను కలుస్తారని దిల్‌ రాజు చెప్పారు.

వ్యాపార రంగంలో కొనసాగుతున్నప్పుడు ఐటీ అధికారుల తనిఖీలు సాధారణమేనని చెప్పారు. తనిఖీల సందర్భంగా తమ వద్ద ఉన్న అకౌంట్‌ బుక్స్‌‌ను చెక్‌ చేశారని, స్టేట్‌మెంట్‌ నమోదు చేశారని దిల్ రాజు వివరించారు. ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీశారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+