ఆ కేసు ఆ గర్భిణీ ప్రాణం తీసిందా? మహిళల వెన్నులో వణుకు!

మహిళల కోసం తీసుకువచ్చిన చట్టాలు ఒక్కోసారి మహిళల ప్రాణాలని హరిస్తున్నాయి అన్న సంఘటన తాజాగా వనస్థలిపురం గర్భిణీ హత్య కేసులో నిజమైంది. భర్త అత్తింటి వేధింపుల పైన, వారిపైన కేసు పెట్టేలా, కఠిన చట్టాలను తీసుకువచ్చిన క్రమంలో మహిళలు వేధింపులకు గురిచేసిన వారిపైన పెడుతున్న కేసులు, వారి ప్రాణాలు మీకే తీసుకువస్తున్న సంఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి.

గృహ హింస చట్టంలో కేసు పెడితే ప్రాణాలకే ప్రమాదంగా పరిస్థితి

డొమెస్టిక్ వయలెన్స్ కింద కేసులు పెట్టి తమ జీవితాలతో మహిళలు ఆడుకుంటున్నారు అన్న అభిప్రాయం చాలామంది పురుషులలో వ్యక్తమవుతుంది. ఈ చట్టాన్ని మిస్ యూస్ చేస్తున్నారు అన్న భావన కూడా వ్యక్తీకరిస్తున్నారు. తమ జీవితాన్ని నాశనం చేసి వారు మాత్రం సుఖంగా జీవిస్తున్నారని మహిళలపైన కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టం కొన్ని సందర్భాలలో మహిళల ప్రాణాలమీదకే తీసుకువస్తున్న పరిస్థితులతో దీనిపైన సభ్యసమాజం ఆలోచనలో పడింది.

Domestic Violence Act case is a reason behind pregnant murder case women in panic debate on act

మహిళల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఘటన

తాజాగా వనస్థలిపురం గర్భిణీ మహిళ హత్య కేసులో కూడా ఇదే జరిగింది. గృహహింస చట్టం కింద కేసుపెట్టి తన జీవితం నాశనం చేసిందన్న కక్షతో భర్త ఆమెను అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన ఇప్పుడు మహిళల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. భర్త అత్తమామల వేధింపులపైన పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులు పెడుతున్న మహిళలు, తమ సమస్యకు పోలీస్ స్టేషన్ల ద్వారా పరిష్కారాన్ని వెతుక్కోవడానికి భయపడే పరిస్థితి ఇటువంటి ఘటనలతో కనిపిస్తుంది.

మహిళల రక్షణ ప్రశ్నార్ధకంగా

ఒకప్పుడు మహిళలకు సంబంధించిన కఠిన చట్టాలు లేనప్పుడు మహిళలు వేధింపులకు గురయ్యారు అన్న చర్చ ప్రధానంగా జరిగింది. కఠిన చట్టాలను తీసుకువచ్చిన తర్వాత కూడా మహిళలు అనేక కేసులలో వేధింపులకు గురవుతూనే, ప్రాణాలను కోల్పోతున్న సందర్భాలు మహిళా రక్షణను ప్రశ్నిస్తున్నాయి. అయితే ఈ చట్టాల కారణంగా పెడుతున్న కేసులు పురుషుల భవిష్యత్తు పైన కూడా ప్రభావం చూపిస్తున్న క్రమంలో పురుషులలో ఈ నేరపూరిత ఆలోచనలు వస్తున్నాయి అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.

మహిళా రక్షణా చట్టాలపై పెద్ద చర్చ

పక్క ప్లాన్ చేసుకొని గర్భిణీ అయిన మాజీ భార్యను హత్య చేయాలని ఆలోచించడం, ఆన్లైన్లో కత్తి, రంపం కొనుగోలు చేసుకోవడం, రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో ఇంటికి వెళ్లి గొంతు కోసి హతమార్చడం బాధిత మహిళలకు రక్షణ లేదు అన్న అభిప్రాయానికి ఊతమిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు మన చట్టాల పైన, మన సామాజిక స్థితి పైన, ఆలోచన విధానం పైన పెద్ద చర్చను రేకెత్తిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+