హైదరాబాద్ లో నయా ట్రెండ్.. ఆడవేషంలో వచ్చి చోరీలు..!
లోన్ యాప్స్ లో అప్పు చేసి అవి తీర్చేందుకు నానా తంటాలు పడుతున్నవారు చాలా మందే ఉన్నారు. అప్పు తీర్చే స్థోమత లేక అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. లోన్ యాప్స్ తీర్చేందుకు ఓ వ్యక్తి ఆడవేషం కట్టాడు. ఆడవేషంలో ఫ్రెండ్ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. అలా పక్కాగా ప్లాన్ చేయబోయి పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఆడవేషం కట్టి ఫ్రెండ్ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 6.75 తులాల బంగారు ఆభరణాలు, రూ.85 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 11 లోని ఉదయ్ నగర్ లో ఉంటున్న శివరాజ్ అనే వ్యక్తి ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి నిజామాబాద్ వెళ్లాడు. ఆ విషయాన్ని తన ఫ్రెండ్ హర్షిత్ కు సరదాగా మాట్లాడుతూ చెప్పాడు.
అయితే అప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న హర్షిత్ లింగంపల్లిలో సీసీ కెమెరా టెక్నీషియన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శివరాజ్ ఇంట్లో భారీగా డబ్బు, నగలు ఉన్నాయని వాటిని చోరీ చేసేందుకు ప్లాన్ వేశాడు హర్షిత్. ఈ క్రమంలో ఆడ వేషంలో వెళ్లి చోరీకి పాల్పడ్డాడు. మరుసటి రోజు శివరాజ్ కుటుంబం హైదరాబాద్ కు వచ్చింది. ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి, అల్మారాలోని 6.75 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఒక మహిళ ఇంట్లోకి వెళ్లడం, తిరిగి రావడం అందులో రికార్డు అయింది. అలాగే ముందు రోజు రికార్డు అయినవి కూడా పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో చోరీకి ముందు రోజు ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ వ్యక్తి హర్షిత్ అని శివరాజ్ గుర్తించాడు. దీంతో హర్షిత్ పై అనుమానం వచ్చి పోలీసులు లింగంపల్లిలోని అతడి ఇంటిపై దాడి చేసి 6.75 తులాల బంగారు ఆభరణాలు, రూ.85 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications