యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద డ్రోన్ కెమెరా కలకలం: ఇద్దరి అరెస్ట్
యాదాద్రి భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయం పరిసరాల్లో డ్రోన్ కెమెరాలు సంచరించడం కలకలం రేపుతున్నాయి. ఆయల దృశ్యాలను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఆలయ భద్రతను ప్రశ్నార్థం చేస్తున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇష్టారీతిన ఎవరుపడితే వారు డ్రోన్ కెమెరాలతో ఆలయాన్ని చిత్రీకరిస్తుండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంపై అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగేయడంపై పోలీసులు తీవ్రంగా పరిగణించారు. డ్రోన్లను గమనించిన ఎస్పీఎస్ అధికారులు, సిబ్బంది డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సూర్యపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఎల్లపు నాగేంద్రబాబు, ఎల్లపు నాగరాజుగా వీరిని గుర్తించారు.

ఈ ఇద్దరు యూట్యూబర్స్ శుక్రవారం సాయంత్రం యాదగిరిగుట్టకు చేరుకుని కొండ దిగి పార్కింగ్ స్థలం నుంచి డ్రోన్ కెమెరాను ఎగురవేసి ఆలయ పరిసరాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది.. ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు యువకులను స్థానిక పోలీసులకు అప్పగించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునరుద్ధరణ తర్వాత ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల రాక పెరిగిన విషయం తెలిసిందే. వారాంతాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే గాక, ఇతర రాష్ట్రాల భక్తులు కూడా వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆలయ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ప్రతిరోజు భక్తుల సందడి కనిపిస్తోంది. కాగా, కొందరు ఆలయ నిర్మాణాన్ని ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications