డ్రగ్స్ కేసు: ముగిసిన ముమైత్ విచారణ, తిరిగి బిగ్ బాస్ షోకు? రేపు ‘మాస్ మహరాజా’
డ్రగ్స్ కేసులో ఐటెం సాంగ్స్ గర్ల్ ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. సుమారు ఆరున్నర గంటలపాటు ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు విచారించారు. ఇక ఈ కేసులో విచారణకు శుక్రవారం హీరో రవితేజ హాజరుకానున్నరు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఐటెం సాంగ్స్ గర్ల్ ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. సుమారు ఆరున్నర గంటలపాటు ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు విచారించారు. హైకోర్టు నిబంధన మేరకు సాయంత్రం 5 గంటల లోపలే అధికారులు తమ విచారణ ముగించారు. విచారణ ముగియగానే ముమైత్ తిరిగి బిగ్ బాస్ సిబ్బందితో కలిసి వెనుదిరిగారు.
బిగ్ బాస్ షో ప్రతినిధులతో కలిసి పూణే నుంచి హైదరాబాదు చేరుకున్న ముమైత్... వారితో కలిసి ఉదయం 9.30 గంటలకే సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం సిట్ కార్యాలయంలోకి వెళ్లేటప్పుడు కూడా ముమైత్ ఖాన్ చాలా కూల్ గా కనిపించారు.

వెళ్లేముందు కూల్.. లోపల మాత్రం..
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా గురువారం ఐటెం సాంగ్స్ గర్ల్ ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు విచారించారు. విచారణకు వెళ్లే సమయంలో కూల్ గా కనిపించిన ముమైత్ ఖాన్ విచారణ సందర్భంగా అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడంతో ఉక్కిరిబిక్కరి అయ్యారు. ఉదయం నుంచి కెల్విన్ తో సంబంధాలు, డ్రగ్స్ వినియోగం, సరఫరా, పార్టీ లైఫ్ వంటి విషయాలపై ముమైత్ ఖాన్ నుంచి పలు వివరాలు రాబట్టారు.

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన ముమైత్
ముంబై కేంద్రంగా చాలకాలంగా పనిచేశారు కదా.. ముంబై డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయా? డ్రగ్స్ సరఫరా చేసే వారు మీ ద్వారానే హైదరాబాద్ టాలీవుడ్ పెద్దలకు పరిచయం అయ్యారా? మీరు డ్రగ్స్ తీసుకునే వారా? లేక అమ్మకాలేమైనా జరిపారా? పబ్‌లకు వెళ్లే అలవాటు ఉందా? ఖాళీ సమయాల్లో వారంతాల్లో ఎక్కడ గడిపేవారు? పూరి, చార్మితో పరిచయం ఎప్పటినుంచి ఉంది? పోకిరి సినిమాతోనే పూరికి మీరు క్లోజ్ అయ్యారా?
తెలుగు సినిమా ఇండ్రస్టీకి రాకముందు మీరు ఏం చేసేవారు? హైదరాబాద్‌ని విడిచి ముంబాయికి ఎందుకు వెళ్లారు? అంటూ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

ఇవే ఆ ప్రశ్నలు...
ముమైత్ ఖాన్ విచారణ సందర్భంగా డ్రగ్ డీలర్ కెల్విన్ తో పరిచయం గురించి ఇంకా ఇతర నటులతో ఉన్న పరిచయాల గురించి సిట్ అధికారులు ఎక్కవగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. కెల్విన్‌తో ఎలా పరిచయం? కేవలం సినిమా పంక్షన్స్‌లో మాత్రమే కెల్విన్‌తో కలిసేవారా? ఐటమ్ సాంగ్స్‌లో నటించే మీరు.. చిత్ర యూనిట్‌తో బ్యాంకాక్, విదేశాలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నెలకోసారి జరిగే గోవా ఫెస్టివెల్స్‌లో ఏం తీసుకోనేవారు? హైదరాబాద్‌లో ఉన్నప్పుడు వీకెండ్ లో ఎక్కువగా ఎవరి పబ్‌లకు వెళ్లేవారు? తరుణ్, నవదీప్ పబ్‌లకు ఎన్నిసార్లు వెళ్లారు? రెండేళ్లుగా ముంబాయిలో ఉంటూ హైదరాబాద్‌లో షూటింగ్ ల కోసమే వచ్చేవారా? హైదరాబాద్ లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు?

మళ్లీ ‘బిగ్ బాస్ షో’కు ముమైత్?
హైకోర్టులో హీరోయిన్ ఛార్మీ పిటీషన్ వేసిన నేపథ్యంలో సిట్ అధికారులు అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించడం మానేశారు. గురువారం నాటి విచారణలో కూడా ముమైత్ ఖాన్ నుంచి వారు ఎలాంటి రక్త నమూనాలు సేకరించనట్లు తెలుస్తోంది. విచారణ ముగియగానే ముమైత్ తిరిగి బిగ్ బాస్ సిబ్బందితో కలిసి వెనుదిరిగారు. మళ్లీ తిరిగి ఆమె బిగ్ బాస్ హౌస్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎవరినీ కలవకుండా, కనీసం ఆమెకు ఫోన్ కూడా అందుబాటులో లేకుండా బిగ్ బాస్ షో నిర్వాహకులు జాగ్రత్తపడ్డారు.

రేపు సిట్ ముందుకు ‘మాస్ మహరాజా’...
డ్రగ్స్ కేసులో విచారణకు శుక్రవారం హీరో రవితేజ హాజరుకానున్నరు. రవితేజ, డగ్ర్స్ డీలర్ కెల్విన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. కెల్విన్ ఫోన్ లో హీరో రవితేజ నంబర్ అధికారులకు దొరికింది. జీషాన్ తో రవితేజకు ఆరేళ్ల నుంచి పరిచయం ఉందని, అతడే రవితేజను కెల్విన్ కు పరిచయం చేశాడని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హీరో రవితేజ సిట్ అధికారుల విచారణకు హాజరుకావడం కీలకంగా మారింది.

కీలక అంశాలు వెలుగులోకి..?
సిట్ నోటీసులు జారీ చేసినవారిలో రవితేజ పేరు వెలుగు చూడడంతో టాలీవుడ్ నిర్ఘాంతపోయింది. ఈ మధ్యే కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రవితేజ తమ్ముడు భరత్ పలు సందర్భాల్లో డ్రగ్స్ వివాదంలో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో రవితేజ పేరు చెడగొడుతున్నాడంటూ భరత్ పై విమర్శలు కూడా వెలువడ్డాయి. అయితే కెల్విన్, జిషాన్ ల విచారణలో షాక్ అయ్యే అంశాలు వెలుగు చూశాయి. వీరిద్దరి విచారణలో కూడా రవితేజ పేరు వెలుగు చూసింది. విచారణలో భాగంగా.. హీరో రవితేజకు డ్రగ్స్ తానే సరఫరా చేసినట్లు జిషాన్ ఒప్పుకున్నాడు. అంతేకాకుండా, డ్రగ్ డీలర్ కెల్విన్ కు రవితేజను పరిచయం చేసింది కూడా తానే అని చెప్పడంతో ఈ కేసులో హీరో రవితేజను కీలకమైన వ్యక్తిగా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు . శుక్రవారం నాటి విచారణలో రవితేజ నుంచి మరిన్ని కీలక అంశాలు వెలుగుచూసే అవకాశాలున్నట్లు వారు భావిస్తున్నారు.
-
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications