మాస్కుల పేరుతో డ్రగ్స్ దందా ... డ్రగ్స్ రాకెట్ ఛేదించే పనిలో పోలీసులు.. షాకింగ్ విషయాలు వెల్లడి
ఎన్ 95 మాస్కుల పేరుతో డ్రగ్స్ దందాకు తెరతీశారు హైదరాబాద్ లోని డ్రగ్స్ మాఫియా. బెంగళూరు నుండి ఫేస్ మాస్క్ ల బిజినెస్ పేరుతో డ్రగ్స్ అక్రమ రవాణాకు తెరతీశారు కొందరు పాత నేరస్తులు. గతంలో డ్రగ్స్ దందా చేసి కేసులు కూడా నమోదు అయిన పాత నేరగాళ్ళు ఇప్పుడు మరోమారు బెంగళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు.

కరోనా మాస్కుల ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ ..54 గ్రాముల కొకైన్ స్వాధీనం
హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు తాజాగా ఇద్దరూ డ్రగ్స్ మాఫియా సభ్యులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 54 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో హైదరాబాద్ లో డ్రగ్స్ దందా నిర్వహించిన నైజీరియన్ మైక్ నుండి వారు 70 గ్రాముల కొకైన్ కొనుగోలు చేసినట్లుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన పరంజ్యోతి సింగ్,అమిత్ కుమార్ లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా, కరోనాను అడ్డు పెట్టుకొని డ్రగ్స్ దందా సాగించారు.

డ్రగ్స్ దందాపై సినీ ప్రముఖులతో పాటు 300 మందిపై నిఘా
కోవిడ్ పాసులు తీసుకొని ఎన్ 95 మాస్కులు తీసుకువస్తున్నట్లుగా నమ్మించి,మాస్కుల ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్నారు.ఇక వీరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు వీరు హైదరాబాద్ లోనే కాకుండా, బెంగళూరు లోనూ డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఇక ఈ వ్యవహారంలో మరో కీలక విషయం కూడావెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ దందా వ్యవహారంలో 300 మందిపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ మూడు వందల మందిలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఉండటం ఆయా వర్గాలకు టెన్షన్ పుట్టిస్తుంది.
Recommended Video

డ్రగ్స్ ముఠా కాల్ డేటా,వాట్సప్ డేటా డిలీట్ .. రిట్రీవ్ చేస్తున్న అధికారులు
ఇప్పటివరకు అమిత్, పరంజ్యోతిలను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు వారి కాల్ డేటాను,వాట్సాప్ చాటింగ్ లను పరిశీలించే పనిలో ఉన్నారు. ఇక ఇద్దరూ మొబైల్ లోని కాల్ డేటాను, వాట్సాప్ చాటింగ్ లను డిలీట్ చేయడంతో డేటారిట్రీవ్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ భాగ్యనగరంలో చాపకింద నీరులా కరోనాతో విలవిలలాడుతున్న ఈ సమయంలో కూడా డ్రగ్స్ దందా మూడు ప్యాకెట్ల కొకైన్, ఆరు ప్యాకెట్ల ఎండిఎంగా జోరుగా సాగుతూనే ఉంది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications