EAPCET -2026:షెడ్యూల్ ఖరారు - దరఖాస్తులు, పరీక్షల తేదీలు ఇలా..!!
ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న ఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం అవుతాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 4, 2026వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆయా పరీక్షలకు సంబంధించి కన్వీనర్లను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ని ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్, బీ ఫార్మసీ వంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈఏపీసెట్ 2026) నోటిఫికేషన్ విడుదల చేసారు. షెడ్యూల్ ప్రకారం ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు మే 4, 5 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరుగుతాయి. కాగా ఈ ఏడాదికి కూడా ఈ ఏడాదికి కూడా జేఎన్టీయూ-హైదరాబాద్ ఆధ్వర్యంలోనే TG EAPCET 2026 పరీక్ష జరగనుంది. ఎప్‌సెట్‌లో భాగంగా తొలి రెండు రోజులు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తారు, మే 9వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులపాటు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసారు. అమ్మాయిలు సాధ్యమైనంత వరకు ఉదయం వేళల్లో జరిగే పరీక్షలు రాసేలా, నగరంలోని ఎగ్జామ్ సెంటర్లను కేటాయించడంపైనా దృష్టి సారించారు.

పరీక్షల తేదీలు
ఇక, మధ్యాహ్నం షిఫ్ట్‌లో జరగనున్న పరీక్షలు సాయంత్రం 6 గంటలకు పూర్తవుతాయి. కొన్ని అనివార్య పరిస్థితుల్లో కొద్దిసేపు కంప్యూటర్లు పనిచేయకపోవడం లాంటి సందర్భాల్లో మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడకూడదన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. ఈసారి సెట్ల దరఖాస్తు ఫీజుల్లో ఎటువంటి మార్పు లేదు. జోసా షెడ్యూల్ తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని వీలైనంత మేరకు త్వరగా ప్రవేశాల ప్రక్రియ జరుపుతామని ఛైర్మన్ వెల్లడించారు. ఇక..ఫిబ్రవరి 14న ఈఏపీసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంఅవుతాయని వెల్లడించారు. ఇక, ఏప్రిల్ 4వ తేదీ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ గా నిర్ణయించారు. అయితే.. మే 4, 5, 9, 10, 11 తేదీల్లో ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీలుగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications