హోలీనాడు రోజంతా ఆ ఫోన్ల డేటా ముందుంచి కవిత విచారణ.. పట్టు బిగిస్తున్న ఈడీ!!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈడీ వదిలేలా కనిపించటం లేదు, ఈ కేసులో కవిత కీలకంగా వ్యవహరించారని అనేక ఆధారాలతో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు, ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ఈడీ అధికారులు ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ ను, మరోవైపు కవితను విచారిస్తున్నారు. నిన్న హోలీ నాడు సెలవు దినం కాబట్టి విచారణ ఉండకపోవచ్చు, లేదా ఉన్నా ఏ కొద్ది సేపో విచారణ జరుపుతారని భావిస్తే నిన్న కూడా కవితను ఊపిరాడనివ్వకుండా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు ఈడీ అధికారులు. నిన్నంతా కవితను ప్రశ్నిస్తూనే ఉన్నారు.

ED inquired kavitha on holi day with those phones data about money laundering

ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మేక శరణ్ పాత్ర ఏమిటి? డబ్బులు ఎలా చేతులు మారాయి?ఎవరెవరికి మధ్య లావాదేవీలు జరిగాయి? తదితర అంశాలను ఈడి ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు కవిత, ఆమె భర్త అనిల్, కవిత వద్ద పనిచేసే వ్యక్తిగత సహాయకుల నుండి స్వాధీనం చేసుకున్న మూడు మొబైల్ ఫోన్ల నుండి డేటాను కవిత ముందుంచి దాని పైన కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది.

ఇక కవితను మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రు పాత్రపై కూడా గట్టిగానే ప్రశ్నించినట్లు సమాచారం. ఈరోజు ఉదయం 11 గంటలకు మళ్ళీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశ పెట్టవలసిన క్రమంలో, నిన్న కవితను ఊపిరాడనివ్వకుండా అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు ఈడీ అధికారులు. మరోవైపు కేజ్రీవాల్ ను కూడా విచారిస్తున్న క్రమంలో, వీరిద్దరు చెప్పే సమాధానాలలో పోలికలను బేరీజు వేసే పనిలో ఉన్నారు.

అయితే వీరిద్దరు విచారణకు సహకరించడం లేదన్నది ఈడి అధికారుల వాదన. కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంపాదించిన డబ్బుతో నిజామాబాద్ తో పాటు ఏపీలో కూడా పలు వ్యాపారాల్లో ఉన్నారని, వీటన్నిటి వివరాలను కూడా రాబట్టే పనిలో ఉంది ఈడి. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో కవితపై ఉచ్చు బిగిస్తున్న ఈడి నేర నిరూపణ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+