Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎనిమిదేళ్ళు సహజీవనం చేసిన ఫలితం.. వేధింపులతో యువతి తీవ్ర నిర్ణయం!!

హైదరాబాద్: సహజీవనం ఆమె కొంప ముంచింది. అతనితో కలిసి జీవితం బాగుంటుందని నమ్మిన యువతి మోసపోయింది. తనతో సహజీవనం చేస్తూ వేరొకరిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన వ్యక్తిని నమ్ముకున్న పాపానికి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర మానసిక వేదనకు గురైన యువతి తీసుకోకూడని నిర్ణయం తీసుకుని అనంత లోకాలకు వెళ్ళిపోయింది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఇందిరానగర్ వాసి అయిన ఆర్. సదానంద్ ఒక ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతను అదే ప్రాంతంలో నివసించే 27 సంవత్సరాల రెడపాక పల్లవితో గత ఎనిమిది సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడు. పల్లవితో సహజీవనం చేస్తూనే మరో యువతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు.అయితే కొద్ది రోజులుగా సదానంద్ పల్లవితో తరచూ గొడవకు దిగుతున్నాడు. ఆమెను అకారణంగా కొడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు.

eight years living relationship result..young woman serious decision due to harassment!!

దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన పల్లవి ఈనెల 22వ తేదీన రాత్రి 10 గంటలకు పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తి లో నివసించే తల్లికి ఫోన్ చేసి తన బాధంతా చెప్పుకుంది. సదానంద్ తనను తీవ్రంగా కొడుతున్నాడని, వేధిస్తున్నాడని, చచ్చిపోవాలని బెదిరిస్తున్నాడని, లేదంటే పుట్టింటికి వెళ్ళిపోమంటున్నాడని తల్లికి చెప్పింది. రేపు నేను వస్తాను.. దిగులు పడొద్దని చెప్పిన తల్లి 23వ తేదీ ఉదయం పెద్దపల్లి జిల్లా నుండి కూతురు దగ్గరకు బయలుదేరింది.

తల్లి మార్గమధ్యలో ఉండగానే ఆమెకు ఫోన్ చేసిన సదానంద్ రాత్రి పల్లవి ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. పల్లవి అదే రోజు రాత్రి ఫ్యాన్ కు ఉరి వేసుకుని మరణించింది. దీంతో నగరానికి చేరుకున్న తల్లి కూతురి మృతదేహం చూసి కన్నీరు మున్నీరు అయ్యింది. ఆపై బంజారా హిల్స్ పోలీసులకు సదానంద్ పై ఫిర్యాదు చేసింది. సదానంద్ వల్లే తన కుమార్తె ఈ దారుణానికి పాల్పడిందని తల్లి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఓ వ్యక్తితో చేసిన సహజీవనమే చివరకు ఆ యువతి ప్రాణాలు తీసుకునే దాకా తీసుకువచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+