కేసీఆర్ పార్టీకి ఎన్నికల సంఘం బిగ్ షాక్

దేశంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు నవంబర్, డిసెంబర్‌లలో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల సంఘం రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం తెలంగాణలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాకిచ్చిందనే చెప్పాలి.

ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని తెలుసు కాని.. ఇంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తారని తెలంగాణ నేతలు ఊహించలేదు.ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో.. ఎన్నికల కోడ్ తక్షణమే అమలు కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతోపాటు కొత్తగా సంక్షేమ పథకాలు ఏమీ కూడా ప్రకటించడానికి వీల్లేదంటూ ఎన్నికల సంఘం తెలిపింది.

Election Commission

ఎమ్మెల్యేవరూ కూడా ప్రభుత్వ వాహనాలను వినియోగించుకోవడానికి కుదరదని ఎన్నికల సంఘం చెప్పుకొచ్చింది. రాష్ట్రంలో ఎన్నికలకు సరిగ్గా 50 రోజుల సమయ మాత్రమే ఉంది. అయితే అభ్యర్థులను ముందుగానే ప్రకటించి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికలకు రెడీగా ఉంది. దాదాపు 90 శాతం అభ్యర్థులను ప్రకటించేశారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకంటే బీఆర్ఎస్ ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్దంగా ఉంది.

 CM KCR

కాకపోతే ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందే కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావించారు.డబల్ బెడ్ రూం ఇళ్లను కూడా పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో..సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడిక్కడ ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+