తెలంగాణలో ఆ రెండు స్థానాలు దక్కేదెవరికి..!?

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు రంగం సిద్దం. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో 2, ఏపీలో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు.

దీనికి సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. 23వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. మార్చి 13న పోలింగ్ జరగనుంది. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనుండగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పదవీకాలం మే 1తో పూర్తి కానుంది.

టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి స్థానంలో పలువురు ఉపాధ్యాయ సంఘాలు పోటీ పడుతున్నాయి ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసాయి. క్షేత్ర స్థాయిలో ప్రాచారం ప్రారంభించాయి. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉండటంతో ఎవరెవరు బరిలో నిలిచేది నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసిన తరువాత స్పష్టత రానుంది.

Election Commission Release Election Schedule for Two MLC Seats in Telangana

అదే విధంగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ సీటు తిరిగి ఎంఐఎంకు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందు కోసం తిరిగి జాఫ్రీనే కొనసాగిస్తారా.. మరో నేతకు అవకాశం ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎంఐఎం తమ అభ్యర్ధిని ఎమ్మెల్సీగా నిలబెట్టేందుకు బీఆర్ఎస్ సహకరిస్తే విజయం సులువు కానుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల పరిధిలో ఇతర పార్టీలు నామ మాత్రంగానే ఉన్నాయి.

గ్రేటర్ ఎన్నికల సమీకరణాల్లో భాగంగా ఎంఐఎం- బీఆర్ఎస్ సహకరించుకొనే అవకాశం కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేతలు ఎంఐఎం శాసనభా పక్ష నేత అక్బరుద్దీన్ తో సమావేశమయ్యారు. తిరిగి కాంగ్రెస్ - ఎంఐఎం కలుస్తున్నాయనే చర్చ మొదలైంది. దీనిని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఖండించారు.

ఎంఐఎంతో పొత్తు పై చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో...వచ్చే నెలలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు అధికార బీఆర్ఎస్ - ఎంఐఎం నిర్ణయం మేరకు కొత్త అభ్యర్ధి ఎన్నిక అయ్యే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా ఏకగ్రీవానికి ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక.. ఉపాధ్యాయ నియోజకవర్గంలో మాత్రం పోటీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+