సీఎం సొంత జిల్లాలో కలెక్టర్ పై దాడి ఘటనకు కారణం ఆయనే!

ఫార్మాసిటీ నిర్మాణం కోసం వికారాబాద్ జిల్లాలో లగ్గిచర్ల గ్రామంలో కలెక్టర్ పైన, అభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారుల పైన గ్రామంలోని రైతులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఓ మహిళా రైతు కలెక్టర్ ను వెనక నుండి భుజం పైన కొట్టగా, అధికారుల వాహనాలను అక్కడ ఆందోళన నిర్వహించిన రైతులు రాళ్లతో, కర్రలతో దాడి చేసి ధ్వంసం చేశారు.

పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ పాలన
ఇక ఈ ఘటన పైన మాజీమంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గరీబీ హటావో అని ఇందిరాగాంధీ పిలుపునిస్తే ఫార్మాసిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడు అని మండిపడ్డారు. పిచ్చోడి చేతిలో రాయి లాగా రేవంత్ రెడ్డి పాలన తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ex minister harish rao targets revanth reddy over attack on collector and officials in Vikarabad

రేవంత్ మీద కోపంతోనే దాడి
రైతులు రేవంత్ మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్ మీద ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఫార్మాసిటీ కోసం భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైందని హరీష్ రావు ఆరోపించారు .

పచ్చని పంట పొలాల్లో ఫార్మా చిచ్చు
ఫార్మాసిటీ కోసం కేసీఆర్ హైదరాబాద్ కు దగ్గరగా పదిహేను వేల ఎకరాల సేకరించి సిద్ధం చేశారని, కాలుష్యం లేకుండా జీరో వ్యర్ధాలతో దానిని అక్కడ ఏర్పాటు చెయ్యాలని భావించారని హరీష్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ దగ్గరగా సిటీ కోసం సేకరించిన భూమికి సంబంధించి అన్ని అనుమతులు వచ్చాయని, అనుమతులు కూడా వచ్చిన దాన్ని పక్కనపెట్టి పచ్చని పంట పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫార్మా కంపెనీ ఏర్పాటు వెనక్కు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్
ఇక రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని హరీష్ రావు సూచించారు. వికారాబాద్ జిల్లాలోని పచ్చని పంట పొలాలను ఫార్మాసిటీ పేరుతో నాశనం చేయొద్దని, పచ్చని పంట పొలాలలో ఫార్మా కంపెనీ ఏర్పాటు వెనక్కు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరిక
ఒక్క వికారాబాద్లో మాత్రమే కాదు జహీరాబాద్ న్యాల్కల్ మండలం లోనూ ఇదే పరిస్థితి ఉందని, ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న అసహనం రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం అని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తీరు మారకుంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పకుండా చూస్తాడని హరీష్ రావు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+