Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈటల రాజేందర్ గెలుస్తాడన్న మాజీమంత్రి మల్లారెడ్డి యూ టర్న్

లోక్సభ ఎన్నికలలో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. అబ్బే అదేమీ లేదు, ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ చెప్పే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

యూటర్న్ తీసుకున్న మాజీమంత్రి మల్లారెడ్డి
ఈటల రాజేందర్ ను మునగ చెట్టు ఎక్కించి కిందకు పడేయాలన్న ఉద్దేశంతోనే మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ పేర్కొన్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా యూటర్న్ తీసుకున్నారు. ఈటల రాజేందర్ ను నువ్వు గెలుస్తున్నావ్ అంటే ఆయన గెలుస్తాడా ఏంటి అంటూ ప్రశ్నించారు.

Ex minister Mallareddy U-turn on the comments of Etela Rajender

ఈటల నా పాత మిత్రుడు
బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తో మల్కాజ్ గిరిలో నువ్ గెలుస్తున్నావ్ అన్నా అంటూ నిన్న వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి నేడు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తో కలిసి మీడియా సమావేశం నిర్వహించి ఈటల రాజేందర్ తన పాత మిత్రుడని, ఒక వివాహానికి హాజరైన క్రమంలో చాలా రోజుల తర్వాత కలిసాడని, దాంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మాట్లాడుకున్నాం అన్నారు.

మల్కాజ్ గిరిలో పోటీ చేస్తున్నావ్ విజయోస్తు అన్నా తప్పేంటి
ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే తప్పక శుభాకాంక్షలు చెబుతామని, ఇదే క్రమంలో ఈటల రాజేందర్ పుట్టిన రోజున తను దేవుడు దీవెన కలగాలని శుభాకాంక్షలు చెప్పానన్నారు. మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నందున విజయోస్తు అన్నానని వివరించారు. ఇక ఒక స్నేహితుడికి శుభాకాంక్షలు చెప్పడానికి తప్పేమిటి అంటూ మల్లారెడ్డి మీడియాను ప్రశ్నించారు. నాకు ఎదురుపడిన వ్యక్తిని పలకరించి మాట్లాడటం వెనుక ఏదో రహస్య అజెండా ఉంది అనడం ఏమిటంటూ ప్రశ్నించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పిన కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారా?
2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు నేను కాంగ్రెస్ అభ్యర్థి టీ వజ్రేష్ యాదవ్ గెలుస్తాడని చెప్పానని, మరి ఆయన గెలిచాడా అంటూ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో బిజెపి గెలిచే అవకాశమే లేదని, బిజెపి నాయకులంతా మోసగాళ్లని, వాళ్లు వీడియోలను వైరల్ చేసుకుంటూ బతుకుతారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+