మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!!

మందు బాబులు పండుగ చేసుకున్నారు. లిక్కర్ సేల్స్ కొత్త రికార్డు నెలకొల్పాయి. ఎక్సైజ్ శాఖ ఆదాయం అంచనాలను మించింది. పండుగలు.. ప్రత్యేక సందర్భాలు.. మారిన లిక్కర్ పాలసీ.. సవరణలు భారీగా లిక్కర్ ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి. బ్రాండ్ల విషయంలోనూ ఎక్సైజ్ అధికారుల ప్రణాళికలు ఫలితాలను ఇచ్చాయి. దీంతో.. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఖజానాకు రూ.44,557 కోట్లు ఆదాయం సమకూరింది.

ఆదాయంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. శాఖ చరిత్రలోనే తొలిసారిగా ఆదాయం రూ.44,000 కోట్ల మార్కు దాటింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు ఏకంగా రూ.40,209 కోట్లకు చేరాయి. ఈ అమ్మకాల ద్వారా ఎక్సైజ్‌ శాఖకు దాదాపు రూ.39,368 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది కాక, మద్యం దుకాణాల ఫీజుల రూపంలో రూ.1,771 కోట్లు, బార్ల ద్వారా రూ.549 కోట్లు, కొత్త షాపుల కేటాయింపు లైసెన్స్‌ దరఖాస్తుల రూపంలో మరో రూ.2,869 కోట్లు సమకూరాయి. మొత్తంగా 2025-26లో ఎక్సైజ్‌ శాఖ ఖజానాకు రూ.44,557 కోట్లు ఆదాయం సమకూరింది. ఏడేళ్ల కాలంలోనే ఆదాయం రెట్టింపు కావడం గమనార్హం. 2018-19లో రూ.20,859 కోట్లుగా ఉన్న ఆదాయం 2025-26 నాటికి రూ.44వేల కోట్లు దాటింది. 2024-25తో పోలిస్తే 2025-26లో మద్యం అమ్మకాలు 7శాతం పెరిగాయి. 2024-25లో రూ.37,487కోట్ల అమ్మకాలు జరగ్గా 2025-26లో రూ.39,368 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే అదనంగా దాదాపు రూ.2,722 కోట్లు సమకూరాయి.

excise-in-telangana-creates-new-record-in-liquor-revenue-around-rs-44000-cr-in-last-financial-year

భారీగా ఆదాయం తెచ్చి పెట్టిన అమ్మకాలు

కాగా, 2025-26లో 382.91 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరగ్గా 2024-25లో 72.25 లక్షల కేసులు విక్రయించారు. బీరు అమ్మకాలు పరిశీలిస్తే.. 2024-25లో 536.13 లక్షల కేసులు అమ్ముడవ్వగా 2025-26లో 387.34 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. బీరు అమ్మకాలు 9 శాతం మేర తగ్గాయి. పంచాయతీ ఎన్నికలు, కన్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో 2025 డిసెంబరులో మద్యం ఏరులై పారింది. ఒక్క డిసెంబరులోనే రికార్డు స్థాయిలో రూ.5,051 కోట్ల అమ్మకాలు జరగ్గా.. వేసవి ప్రభావంతో మే నెలలో బీర్ల అమ్మకాలు పెరిగి రూ.3,561 కోట్లు వచ్చాయి. అత్యల్పంగా అక్టోబరులో రూ.2,709 కోట్లు వసూలయ్యాయి. జూన్‌లో రూ.3,273 కోట్లు, జూలైలో రూ.3,320కోట్లు, ఆగస్టులో రూ. 3,082కోట్లు, సెప్టెంబరులో రూ. 3,048కోట్లు, నవంబరులో రూ.2,868 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక 2026 జనవరిలో రూ.3325 కోట్లు, ఫిబ్రవరిలో రూ.3,208కోట్లు, మార్చిలో రూ.3,486కోట్లతో కలిపి మొత్తం రూ.40,209 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు లెక్కలు తేల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+