ఇంటికి ముఖం చాటేసీ.. అమ్మాయితో మకాం! భార్యకు చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి!!
Hyderabad: ఓ అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టకుంది. ఇంటికి రాకుండా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తన భర్తను పట్టుకుని చితకబాదింది. తన కంటే 20 ఏళ్లు చిన్న వయస్సు అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి జీహెచ్ఎంసీ అధికారి కావడం గమనార్హం. హైదరాబాద్ నగరంలోని వారాసిగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకీరామ్ తన కంటే 20 ఏళ్లు చిన్నదైన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో కలిసి నగరంలోని వారాసిగూడలో మకాం పెట్టాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో అతని భార్య కళ్యాణికి అనుమానం వచ్చింది.

ఈ క్రమంలో తన భర్త జానకీరామ్ ఎక్కడికి వెళుతున్నాడని కళ్యాణి నిఘా పెట్టింది. దీంతో వారాసిూడలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఓ యువతితో మకాం వేసినట్లు గుర్తించింది. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఫాలో చేసిన కళ్యాణి.. ఆ అపార్ట్‌మెంట్‌లోని గదలో వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ క్రమంలో జానకీరామ్ తోపాటు అతనితో ఉన్న యువతిని కూడా చితకబాదారు.
తన కంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్
— Telangana Scribe 🌐 (@TGScribe_) February 21, 2025
ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసిన భార్య pic.twitter.com/TbnqZbpDGp
ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ.. జానకీరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయస్సున్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపారు. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడని ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో అక్కడికి చేరకున్న పోలీసులు జానకీరామ్ తోపాటు ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications