హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.1.33 కోట్ల టోకరా, ఇలా ముగ్గులోకి దింపి..: ఎవరీ దొంగబాబా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లైఫ్ స్టైల్ భవన యజమానిని బురిడీ కొట్టించి రూ.1.33 కోట్లు కొట్టుకెళ్లిన దొంగ బాబాను పోలీసులు బెంగళూరులో గురువారం నాడు అరెస్టు చేశారు. అతనిని హైదరాబాదుకు తరలించారు. అతను పలు ఎన్నో పేర్లతో, పూజల పేరిట ఎందరినో బురిడీ కొట్టించినట్లు పోలీసులు గుర్తించారు.

ఎవరీ శివానంద బాబా

బాధితుల్లో లైఫ్ స్టైల్ భవన యజమానితో పాటు చాలామంది ఉన్నారని తెలుస్తోంది. దొంగ బాబా పేరు బుడ్డప్పగారి శివ. ఇతను గతంలో తిరుపతిలో పూజల పేరితో బాగా డబ్బున్న దంపతులను నిలువు దోపిడీ చేశాడు. కోటి రూపాయలతో ఉడాయించాడు.

అనంతరం నెల్లూరులోని ఆనంద్ రెడ్డి అనే వ్యక్తిని పూజల పేరుతో మోసం చేసి, అతని నుంచి రూ.40 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు హైదరాబాదులో లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి నుంచి రూ.కోటి 33 లక్షలు దోచాడు. బాగా డబ్బున్న వ్యక్తిలను ఇతను టార్గెట్ చేసుకుంటాడు.

 Fake godman arrested

చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లికి చెందిన శివకుమారస్వామి మంత్రించిన ముగ్గులో కరెన్నీ నోట్లు ఉంచి తాను పూజ చేస్తే చాలు.. రెట్టింపు అవుతాయని నాలుగేళ్లుగా మోసాలు చేస్తున్నాడు. బుడ్డప్పగారి శివ, సూర్య, స్వామి, శివానంద బాబా తదితర పేర్లతో చలామణి అవుతున్నాడు.

తనకు అతీంద్రీయ శక్తులు ఉన్నాయని నమ్మించేందుకు నిష్టగా పూజలు చేసేవాడు. ముగ్గులో రూపాయి నోట్లను ఉంచి గులాబీలను కప్పేవాడు. ఆపై అరగంట సేపు ధ్యానం చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పేవాడు. ప్రసాదం పేరుతో మత్తుమందు ఇచ్చి.. బాధితులు మత్తులోకి జారుకోగానే నగదుతో ఉడాయిస్తాడు.

బెంగళూరుకు మకాం

తెలుగు రాష్ట్రాలలో కేసుల నుంచి తప్పించుకునేందుకు అతను బెంగళూరుకు మకాం మార్చాడు. రెండేళ్ల క్రితం బెంగళూరు వెల్లిపోయాడు. హైదరాబాదులోని కొందరు స్థిరాస్తి వ్యాపారులతో పరిచయం పెంచుకని మేడ్చల్ వాసి మోహన్ రెడ్డి, ఆయన ద్వారా లైఫ్ స్టైల్ ఓనర్ మధుసూదన్ రెడ్డిని పరిచయం చేసుకున్నాడు.

బెంగళూరు వెళ్లినప్పుడల్లా మధుసూదన్ రెడ్డి ఆయనను కలిసేవారు. లక్ష్మీ పూజ చేస్తే నోటుకు రెండు నోట్లు అవుతాయని చెప్పేవాడు. వారికి రూ.1.5 లక్షలు పెట్టించి, రూ.3 లక్షలుగా మార్చి వారి విశ్వాసాన్ని చూరగొన్నాడు.

వ్యూహాత్మకంగా..

అలాగే, మధుసూదన్ రెడ్డి నుంచి కోట్లు కొట్టేసేందుకు వ్యూహాత్మకంగా మెలిగాడు. మధుసూదన్ రెడ్డి ఆయనను నమ్మి డబ్బులు ఎక్కువ చేయించుకుందామని పిలిపించుకున్నారు. మంగళవారం ఇన్నోవా వాహనంలో ట్రావెల్స్ డ్రైవర్ షాజహాన్, బాబాను తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత పథకం ప్రకారం ముగ్గులోకి దింపి డబ్బులు కొట్టేశాడు.

పాలమూరులో దొంగ బాబా డ్రైవర్ అరెస్ట్

మహబూబ్‌నగర్‌ జిల్లా ఎర్రవల్లిలో దొంగ బాబా కారు డ్రైవర్‌ శివను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి బాబా వివరాలు సేకరించారు. శక్తిమంతమైన నిద్రమాత్రల వల్లే లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి, ఆయన సతీమణి అపస్మారక స్థితిలోకి వెళ్లారని తెలుస్తోంది.

English summary
Fake godman arrested from Bengaluru in Hyderabad robbery case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X