గజల్ శ్రీనివాస్ కేసు: 'ఆమె వెనుక ఎవరైనా ఉన్నారేమో, మసాజ్ టైంలో అక్కడే ఉన్నా'

Posted By:
Subscribe to Oneindia Telugu
  గజల్ శ్రీనివాస్ గదిలో నగ్నంగా : అలాంటివాడు కాదంటూ మరో కోణం ?

  హైదరాబాద్: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పై రేడియో జాకీ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదని ఈ కేసులో రెండవ నిందితురాలుగా ఉన్న మహిళ చెప్పారు. ఏనాడూ కూడ గజల్ శ్రీనివాస్‌పై ఈ ఆరోపణలు రాలేదని ఆమె గుర్తు చేశారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం చేశారు.

  లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ను హైద్రాబాద్ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. గజల్ శ్రీనివాస్ నిర్వహించే వెబ్ రేడియోలో రేడియో జాకీగా పనిచేసే ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గజల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు.

  లైంగిక వేధింపుల వివాదం: మసాజ్ చేయించుకొన్నా, కానీ, నా బిడ్డగా భావించా: గజల్ శ్రీనివాస్

  అయితే తనపై బాధితురాలు తప్పుడు ఆరోపణలు చేసిందని గజల్ శ్రీనివాస్ చెప్పారు. బాధితురాలు తప్పుడు ఫిర్యాదు చేసిందని గజల్ శ్రీనివాస్ చెప్పారు.అయితే గజల్ శ్రీనివాస్ వద్ద పనిచేసే మరో మహిళ కూడ ఈ విషయమై తనను ప్రోత్సహించిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గజల్ శ్రీనివాస్ కేసులో రెండవ నిందితురాలుగా చేర్చారు.ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించారు.

  గజల్ శ్రీనివాస్ అలాంటి వ్యక్తి కాదు

  గజల్ శ్రీనివాస్ అలాంటి వ్యక్తి కాదు

  ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ అలాంటి వ్యక్తి కాదని ఈ కేసులో రెండవ నిందితురాలుగా ఉన్న మహిళ చెప్పారు.తాను ఐదేళ్ళకు పైగా గజల్ శ్రీనివాస్ వద్ద పనిచేస్తున్నట్టు చెప్పారు. అయితే ఎప్పుడు కూడ గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకోలేదని ఆమె చెప్పారు.

  మసాజ్ చేసిన సమయంలో అక్కడే ఉన్నా

  మసాజ్ చేసిన సమయంలో అక్కడే ఉన్నా

  ఫిజియోథెరపిస్టు రాని కారణంగా గజల్ శ్రీనివాస్‌కు రేడియో జాకీ మసాజ్ చేసిందన్నారు. ఆ సమయంలో తాను కూడ ఉన్నట్టు చెప్పారు. తనకు పిజియోథెరపీ చేయవచ్చని చెప్పినట్టు ఆ మహిళ చెప్పారు.తానే మసాజ్ చేసేందుకు ఒప్పుకొందని చెప్పారు.

  ఆ అమ్మాయి వెనుక ఎవరైనా ఉన్నారా

  ఆ అమ్మాయి వెనుక ఎవరైనా ఉన్నారా

  గజల్ శ్రీనివాస్ వెనుక ఎవరైనా ఉన్నారేమోననే అనుమానాన్ని ఈ కేసులో రెండవ నిందితురాలుగా ఉన్న మహిళ వ్యక్తం చేశారు. కొంత కాలం క్రితం గజల్ శ్రీనివాస్ వద్ద పనిచేసేందుకు రేడియో జాకీ వచ్చిందని చెప్పారు. తానే మసాజ్ కు ఒప్పుకొని ఆ తర్వాత ఇలా ఎందుకు చేసిందో అర్ధం కావడం లేదన్నారు. ఆ మహిళ వెనుక ఎవరైనా ఉన్నారేమోననే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.

  తప్పుడు ఆరోపణలు

  తప్పుడు ఆరోపణలు

  తాను బాధితురాలు రేడియో జాకీని గజల్ శ్రీనివాస్‌కు సహకరించాలని చేసిన ఆరోపణలను ఈ కేసులో రెండో నిందితురాలు ఖండించారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తప్పుడు ఆరోపణలను బాధితురాలు చేసిందని ఆ మహిళ ఆరోపించారు. ఆ అమ్మాయి మసాజ్ చేసిన సమయంలో తాను పక్కనే ఉన్నానని చెప్పారు. మసాజ్‌కు ఒప్పుకొని తర్వాత ఈ రకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆమె ఆరోపించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Parvathi, the maid of Ghazal Srinivas, who has been named as A2 in his sexual harassment case, denied that there was any force on his part on the victim. She said that she has been working with Srinivas from the past 20 years and has not found anything wrong in his behaviour.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి