తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి.!బీజేపీ మీడియా,సోషల్ మీడియా వర్క్ షాప్.!ప్రకాష్ జావదేకర్ దిశానిర్దేశం.!
హైదరాబాద్ : తెలంగాణ బీజేపి కార్యక్రమాల రూపకల్పనలో వేగం పెంచింది. అన్ని రంగాల్లో పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్ షాప్ కొనసాగుతోంది. వర్క్ షాప్ లో బీజేపీ శ్రేణులకు ఎంపి, బీజేపి రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాష్ జవదేకర్, బీజేపి జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇర్ఫాన్, మహారాష్ట్ర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సీతా శాల్ దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేందుకు బీజేపీ కసరత్తు : ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర, జిల్లాల అధికార ప్రతినిదులు, జిల్లాల మీడియా ఇంచార్జ్ లు సోషల్ మీడియా వారియర్స్ హాజరయ్యారు. ఎన్నికల సమయంలో మీడియా, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేందుకు కసరత్తు ప్రారంభించింది బీజేపీ. ఈ వర్క్ షాప్ లో తొమ్మిదేళ్ల బీఆరెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు, నెరవేర్చని హామిలపై ప్రజలను చైతన్య పరిచేందుకు బీజేపీ శ్రేణుల్ని సిద్ధం చేస్తోంది. మరోవైపు బీజేపీ పై కాంగ్రెస్, బీఆరెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ చేసేందుకు బీజేపీ నాయకత్వం తమ సైన్యాన్ని మరింత యాక్టీవ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.

ప్రకాష్ జావదేకర్ సలహాలు : ఈ కార్యక్రమంలో మీడియా సోషల్ మీడియా లో అనుభవం ఉన్న రాష్ట్ర, జాతీయ, స్థాయి పార్టీ నేతలతో బీజేపీ అధికార ప్రతినిధులకు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ కు ఒరియంటేషన్ క్లాసెస్ లో బీజేపీపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఏ విదంగా తిప్పికొట్టలనే దానిపై వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications