హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంతసేపూ.. 'పోర్న్': కొడుకు తీరుపై రగిలిపోయిన తండ్రి, చివరికిలా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయిన తర్వాత.. పొద్దస్తమానం అందులో మునిగితేలుతున్నవాళ్లకు కొదువ లేదు. ముఖ్యంగా ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చాక.. యువతలో స్మార్ట్ ఫోన్ల వినియోగం మరింత పెరిగింది. దీనివల్ల లాభాలెన్నో.. నష్టాలూ ఉన్నాయి. హైదరాబాద్ పహాడీ షరీఫ్ పరిధిలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం..

హైదరాబాద్ పహాడీషరీఫ్‌..:

హైదరాబాద్ పహాడీషరీఫ్‌..:

హైదరాబాద్‌ పాతబస్తీలోని పహాడీషరీఫ్‌ జల్‌పల్లికి చెందిన ఖయ్యుం ఖురేషి మటన్ కొట్టు నడుపుతున్నాడు. ఖురేషి పెద్ద కుమారుడు మహ్మద్‌ ఖాలెద్‌ ఖురేషీ (18)ని ఇటీవలే స్థానిక కేబుల్ టీవిలో పనికి కుదిర్చాడు.

'పోర్న్' ఎడిక్ట్..:

'పోర్న్' ఎడిక్ట్..:

ఎప్పుడూ ఫోన్ లోనే మునిగితేలే ఖాలెద్ ఖురేషీ.. పనికి కూడా తరుచూ డుమ్మా కొట్టేవాడు. ఇంట్లో ఉన్నంత సేపు ఫోన్ లోనే తలపెట్టి ఉండటం తండ్రికి నచ్చలేదు. అయితే అందులో ఏం చూస్తున్నాడా? అని ఆరా తీస్తే.. కొడుకు 'పోర్న్' చూడటానికి ఎడిక్ట్ అయినట్టు గ్రహించాడు.

'పోర్న్' వద్దని మందలించిన తండ్రి

'పోర్న్' వద్దని మందలించిన తండ్రి

ఒక రోజు ఖాలెద్ ఖురేషీ ఫోన్‌లో పోర్న్ చూస్తున్న సమయంలో.. తండ్రి దాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. దీంతో తండ్రి చేయి కొరికి అతను పారిపోయాడు. అప్పటినుంచి ఇంట్లో గొడవ జరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో సోమవారం ఆ గొడవ మరింత పెద్దదైంది.

చివరకు.. చేయినే నరికేశాడు:

చివరకు.. చేయినే నరికేశాడు:

సోమవారం కూడా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న ఖాలెద్.. ఫోన్ లో మళ్లీ పోర్న్ చూస్తున్నట్టు తండ్రి గ్రహించాడు. ఎన్నిసార్లు చెప్పినా.. తీరు మారకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అదే ఆవేశంతో మాంసం నరికే కత్తిని తీసుకొచ్చి తండ్రి కుడిచేతిని నరికేశాడు. ఖాలెద్ కేకలు పెట్టడంతో అతని తల్లి పరిగెత్తుకొచ్చింది. అనంతరం స్థానికుల సహాయంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఖయ్యుం ఖురేషి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

English summary
A father cut off his son's hand in Hyderabad over pornography addiction issue. Father tried somany times to change son's behaviour, but he did't came out from that
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X