జర్మన్ షపర్డ్ కుక్కకు భయపడి.. మూడో అంతస్తు నుంచి దూకేసిన ఫుడ్ డెలివరీ బాయ్

హైదరాబాద్: ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఓ ఇంట్లో డెలివరీకి వెళ్లి అక్కడున్న కుక్కకు భయపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏకంగా మూడంతస్తుల భవనంపైనుంచి దూకేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడలోని శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్(23) అనే యువకుడు మూడేళ్లుగా స్విగ్గీలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజులాగే బుధవారం రాత్రి కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 6లోని లుంబినీ రాక్ క్యాపిటల్ అపార్ట్‌మెంట్ కు ఫుడ్ డెలివరీకి వెళ్లాడు.

Fear of dog; food delivery boy fell down from third floor in hyderabad, injured

అయితే, ఆర్డర్ ఇవ్వాల్సిన ఇంటి తలుపు కొట్టగానే.. ఆ ఇంట్లో ఉన్నజర్మన్ షపర్డ్ కుక్క పెద్దగా మొరుగుతూ పరుగెత్తుకుంటూ వచ్చింది. దీంతో భయపడిపోయిన రిజ్వాన్ తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో రిజ్వాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ఇంటి యజమాని శోభన వెంటనే 108కు సమాచారం అందించారు.

హుటాహుటిన వచ్చిన అంబులెన్స్.. రిజ్వాన్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, ఇంటి యజమాని నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని రిజ్వాన్ సోదరుడు మహమ్మద్ ఖాజా ఆరోపించాడు. తన సోదరుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+