బంగారం ప్రియులకు పండుగలాంటి వార్త.. భారీగా బంగారం ధరల పతనం, కారణాలివే

బంగారం ప్రియులకు పండుగ లాంటి వార్త. విపరీతంగా పెరిగి లక్ష రూపాయల మార్కును చేరుకున్న బంగారం ధరలు కాస్త తగ్గుతున్నాయి. నేడు బంగారం ధర భారీగా పడిపోయింది. గత నాలుగు రోజుల్లో భారీగా పెరిగి లక్షకు చేరువైన బంగారం ధర నేడు తగ్గింది. బంగారం కొనాలనుకునే వారికి నేడు తగ్గిన ధర కాస్త ఊరటనిస్తుంది.

నేడు పతనమైన బంగారం ధరలు
నేడు దేశంలోని ప్రధాన నగరాలలో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 90,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 98,350 రూపాయలుగా ఉంది.

Festive news for gold lovers Huge fall in gold prices here are the reasons

Take a Poll

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలిలా
నిన్నటితో పోలిస్తే నేడు బంగారం ధర 10గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 1250 రూపాయలు, 10 గ్రాముల 22క్యారెట్ల బంగారానికి 1150 రూపాయలు చొప్పున క్షీణించింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 98 వేల 500 రూపాయలు కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90 వేల 300 రూపాయలుగా ఉంది.

ముంబై, బెంగళూరులలో నేడు బంగారం ధరలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90 వేల 150 రూపాయలు కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,350 రూపాయలుగా ఉంది. ఒక బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,350 రూపాయలు కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90 వేల 150 రూపాయలుగా ఉంది.

ట్రంప్ నిర్ణయాలతో భారీగా బంగారం ధరల పతనం
అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం బంగారం ధరల పైన స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే చైనాతో ఒప్పందం చేసుకుంటామని.. వారిపై సుంకాలు తగ్గిస్తామని వెల్లడించగా.. ఇప్పుడు బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేయడంతో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ట్రంప్ తీసుకుంటున్న వివిధ నిర్ణయాల కారణంగా సానుకూల సంకేతాలతో బంగారం రేట్లు మరింత పతనమయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+