మరికొద్ది గంటల్లో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క
భారీ అంచనాల నేపథ్యంలో నేడు (బుధవారం) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై ఆసక్తి నెలకొంది. బుధవారం ఉదయం 11.14 గంటలకు అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్ కావడం గమనార్హం.
2024-25లో 2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఈసారి రూ. 3 లక్షల కోట్లపైనే బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. కేవలం పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే సర్దుబాటు లేకపోవడం గమనార్హం. కేంద్రం కూడా ఈసారి బడ్జెట్ ను గతం కంటే రూ. 2.5 లక్షల కోట్లు మాత్రమే పెంచింది. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్ కూడా కొంత మేర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, అభివృద్ధితోపాటు భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున ఆయా శాఖలకు, పథకాలకు కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయిస్తారు? ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఆరు గ్యారంటీల్లో ఏ పథకానికి ఎన్ని కోట్లు కేటాయిస్తారనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.
ఇది ఇలావుండగా, మంగలవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లుకు ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఇటు శాసనసభతోపాటు శాసనమండలి కూడా ఆమోదం తెలిపింది. అధికార కాంగ్రెస్ పార్టీ తోపాటు బీఆర్ఎస్, బీజేపీ, తదితర అన్ని పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలపడంతో ఉభయ సభల్లోనూ ఈ బిల్లు ఆమోద ముద్ర వేసుకుంది.
-
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. జీతంలో ప్రతి నెలా రూ. 10వేలు కట్: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం -
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications