హైదరాబాద్: మలక్‌పేటలో హోటల్‌లో అగ్నిప్రమాదం, ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని మలక్‌పేటలోని సోహైల్ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్‍లోని కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది.
సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి వరకు పొగ వ్యాపించడంతో రోగులు, వారి సహాయకులు కూడా ఊపిరాడక బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని నాలుగు శకటాలతో మంటలను ఆర్పేశారు.

ప్రమాదం జరగడంతో హోటల్లోని కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగలు రావడంతో ఊపిరాడక హోటల్‌లో పనిచేసే కార్మికుడు షాబుద్దీన్(34) మృతి చెందినట్లు ఏసీపీ దేవేందర్ తెలిపారు.
ప్రమాదం జరిగిన హోటల్‌ను స్థానిక అహ్మద్ బలాలా పరిశీలించారు.
అయితే, ప్రమాదానికి విద్యుదాఘాతం కారణమా? లేక సిలిండర్ పేలి ప్రమాదం జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications