"బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి"
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కర్షకుల ప్రభుత్వం అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వైయస్సార్ హయంలో ఉచిత విద్యుత్ మొదలుకుని పంట బోనస్ దాకా.. అందించినట్లు పేర్కొన్నారు. తమది రైతు ప్రభుత్వం అని తెలిపారు. కేవలం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కామారెడ్డి పర్యటనలో తనను రైతులు అడ్డుకున్నట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత సోషల్ మీడియా కారణంగా జూబ్లీహిల్స్ లో చిత్తుగా ఓడినా బీఆర్ఎస్ కు బుద్ది రాలేదన్నారు.
కామారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను రైతులు అడ్డుకున్నారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సొంత సోషల్ మీడియా కారణంగా జూబ్లీహిల్స్ లో చిత్తుగా ఓడినా బీఆర్ఎస్ కు బుద్ది రాలేదన్నారు.
"అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన గిరిజన బిడ్డ మాలవత్ పూర్ణ కుటుంబాన్ని పరమార్శించడానికి వెళుతుంటే బీఆర్ఎస్ గ్రామ కమిటి అధ్యక్షుడు మా కాన్వాయికి అడ్డుగా వచ్చారు. గిరిజన బిడ్డ మాలవత్ పూర్ణ కుటుంబ సందర్శనను కూడా బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుంది. మాలవత్ పూర్ణ తండ్రిగారు ఇటీవల మరణిస్తే..వారి గ్రామానికి పరమార్శకు వెళ్లాను. గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు మా వాహనం ముందుకు పరుగెత్తుకుని వచ్చాడు. పరామర్శ కార్యక్రమానికి అడ్డుతగలడం బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం" అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

"కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కర్షకుల ప్రభుత్వం. వైయస్సార్ హయంలో ఉచిత విద్యుత్ మొదలుకుని పంట బోనస్ దాకా, మాది రైతు ప్రభుత్వం. కేవలం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశాము. బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి. డిసెంబర్ 11న స్థానిక ఎన్నికల షెడ్యుల్ వస్తుందని ఎక్కడా చెప్పలేదు. అవాస్తవాలను ప్రచారం చేయోద్దని కోరుతున్నాను. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయినా బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం" అని మంత్రి సీతక్క తెలిపారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications