Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ మాజీ ఎమ్మెల్యే పార్క్ హయత్ హోటల్ లో పడుకోమని పిలిచాడు.. నటి శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పాత వీడియోలు, ఇంటర్వ్యూలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. తాజగా టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి ఎప్పుడూ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆమె గతంలో చాలా సార్లు సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాలో నిలిచింది. ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఆమె చేసిన ఆరోపణలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి పాత వీడియోలు, ఇంటర్వ్యూలు బయట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై నటి శ్రీ రెడ్డి ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ట్రెండింగ్‌ లోకి వచ్చింది. అయితే ఈ వీడియోలో నటి శ్రీ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది.

Former BRS MLA Jeevan Reddy Faces Allegations from Actress Sri Reddy Over Park Hyatt Incident

" జీవన్ రెడ్డి ఒక ఫ్రాడ్. నన్ను వేధించాడు. తన వెనుక చాలా మంది ఉన్నారు. అమ్మాయిలను ఎప్పుడూ పార్క్ హయత్ హోటల్‌ కు రావాలని ఇన్ వైట్ చేసాడు. వెళ్లి కలిశాను. నేను స్లీపింగ్ ప్రొడ్యూసర్‌ అని చెప్పాడు. సినిమాల్లో బ్లాక్ మనీ పెడతాం. టాలీవుడ్ పెద్ద పెద్ద హీరోలంతా మేం చెప్పింది చేయాల్సి ఉంటుంది. మేం అధికారంలో ఉన్నాం కాబట్టి చేయాల్సిందే" అని శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.

ఆరోజు తాను కంఫర్ట్‌గా లేనని.. ఆయనను గుడ్డిగా నమ్మి పడుకోలేను కాబట్టి టైమ్ అడిగానని శ్రీ రెడ్డి తెలిపింది. తన ఫ్రెండ్స్ కూడా వెళ్లారని పేర్కొంది. అలా చాలా మంది అమ్మాయిలను వాడుకున్నారని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+